#Krishnam Raju:కృష్ణం రాజుగారి మూడు తీరని కోరికలు...ప్రయత్నించారు కానీ ..!!

First Published Sep 11, 2022, 8:47 AM IST


ప్రముఖ నటుడు కృష్ణంరాజు(83) కన్నుమూసిన సంగతి తెలిసిందే.. కృష్ణంరాజుగారికి మూడు తీరక కోరికలు ఉండిపోయాయని వినికిడి. అందుకోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్తారు. అవేమిటంటే...
 

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు కృష్ణంరాజు(83) కన్నుమూసిన సంగతి తెలిసిందే...గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రసీమలో రెబెల్‌ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజుకు భార్య(శ్యామలాదేవి), ముగ్గురు కుమార్తెలున్నారు. 


ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పెదనాన్న కూడా.  కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో  జరగనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక కృష్ణంరాజుగారికి మూడు తీరక కోరికలు ఉండిపోయాయని వినికిడి. అందుకోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్తారు. అవేమిటంటే...


మొదటది అందిరకిీ తెలిసినదే. ఆయనకు మొగ పిల్లలు లేరు. దాంతో తన సోదరుడు కుమారుడైన ప్రభాస్ ని సొంత బిడ్డలా చూసుకునేవారు. ప్రభాస్ అంటే కృష్ణంరాజుకి ప్రాణం.  రెబల్ వారసుడు ఆయన. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ప్రభాస్ కి పెళ్లి చేయాలని బాగా ట్రై చేశారట . 


కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ పెళ్లిని వాయిదా వేసుకుంటూ రావడంతో.. చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించడం తో ప్రభాస్ పెళ్లి చూడకుండానే ఆయన లాస్ట్ కోరిక తీరకుండానే చనిపోయాని తెలుస్తోంది . ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు మరింతగా బాధపడుతున్నారు. 


  ఇంతకు ముందు ఓ సారి ప్రభాస్‌ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. గతంలో అమ్మాయిని చూస్తున్నామని చెప్పిన కృష్ణంరాజు `ప్రభాస్ పెళ్లి కోసం అంతా ఎదురుచూస్తున్నారగా.. తాను కూడా అందుకోసం ఎదురుచూస్తున్నానని..   అయినప్పుడు చూద్దామ`ని   తెలిపారు. అంటే ఇప్పట్లో ప్రభాస్‌ పెళ్లి లేదని పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు.
 


అలాగే తను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నందుకు... ఓ చిన్న స్టూడియో అయినా కట్టుకోవాలని ఆశపడ్డారట. ఈ విషయం తన సన్నిహితులు వద్ద ప్రస్తావించేవారట. అందుకోసం ఆయన రాజకీయంగా కూడా ప్రయత్నించారని, కానీ పనవ్వలేదు. స్టూడియో మీద సంపాదించాలని కాదని..తన తర్వాత తరాలు వారికి తమ కుటుంబం నుంచి ఇస్తున్న కానుకగా ఉండాలని ఆలోచించే స్టూడియో ప్రయత్నాలు చేసారట.


కానీ ఇండస్ట్రీలో పోటీ, ఆయనకే స్టూడియోకు స్దలాలు వంటివి ఎందుకు ఇవ్వాలని అంటారని ప్రభుత్వాలు ఏమి స్పందించలేదు. తనకు కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నా పని కాలేదని బాధపడేవారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది. తన సమకాలీనులకు స్టూడియోలు ఉన్నాయని తమ కుటుంబానికి లేకపోవటం ఆయనకు ఈ ఆలోచన రావటానికి కారణం అంటారు.


అలాగే ఆయన మరో కోరిక ...తమ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా ఒక్క అడుగు చిత్రం నిర్మించాలని. దాన్ని ఆయన డైరక్ట్ చేయాలని కోరుకున్నారు. కానీ ఆ కోరిక తీరలేదు. స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేసారు. కానీ రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు.
 


అంతేకాకుండా ఆయనకు విశాల నేత్రాలు అనే నవలను సినిమాగా తీయాలని కోరిక ఉండేది. జీవితాంతం ఆ విషయం ఆయన చెప్తూనే ఉన్నారు. భారీ బడ్జెట్ లో ఆ నవలను తెరకెక్కించాలని ఆయన కోరిక. అదీ తీరలేదు.


1940 జనవరి 20న ప.గో. జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు.  కొన్ని దశాబ్దాల పాటు తెలగు సినీ ఇండస్ట్రీని ఏలిన కృష్ణంరాజు...  చిలకా గోరింక చిత్రంతో అరంగేట్రం చేసి... చివరిసారిగా రాధేశ్యామ్ మూవీలో నటించారు. మొత్తం187 చిత్రాలకు పైగా నటించిన కృష్ణంరాజు... నిర్మాతగా గోపీకృష్ణ మూవీస్ స్థాపించారు.  


అమర దీపం సినిమాకు 1977లో బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.  1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో ఉత్తమ నటుడిగా నంది అవార్డ్. 1986లో తాండ్రపాపారాయుడుకు ఫిల్మ్ ఫేర్ అవార్డు. 2006లో దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం లభించాయి.
 


1991లో రాజకీయరంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు.. కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీచేసి గెలిచారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.  కృష్ణంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి  వ్యక్తం చేస్తున్నారు.

click me!