Allu Vs Mega: తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అరవింద్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మగధీర సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్.
Allu Aravind again comments on Ramcharan in telugu
రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నటుడుగా రామ్ చరణ్ కు పేరు తెచ్చినా, కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశపరిచింది.
ఈ నేపథ్యంలో "తండేల్" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంక్రాంతికి విడుదలైన "గేమ్ ఛేంజర్", "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రాల వసూళ్ళపై నిర్మాత అల్లు అరవింద్ సెటైర్లు వేశారు.
24
Allu Aravind again comments on Ramcharan in telugu
సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారన్నారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. అయితే పరోక్షంగా 'గేమ్ ఛేంజర్'పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' చిత్రం గురించి అరవింద్ ప్రస్తావించిన విధానం అవమానకరంగా ఉందని అంటున్నారు. మరికొందరు ముందుంది మొసళ్ల పండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా అరవింద్ మరో సారి రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడారు.
34
Allu Aravind again comments on Ramcharan in telugu
తండేల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అరవింద్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మగధీర సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్. రాజమౌళితో రామ్ చరణ్ ప్రాజెక్టు చేయటం వెనక లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. దానికి అల్లు అరవింద్ సమాధానం ఇస్తూ..." నా అల్లుడు రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా కేవలం యావరేజ్ అయింది.
ఆ తర్వాతి సినిమాకి నేనే నిర్మాత. అందుకే చరణ్‌కి పెద్ద హిట్ ఇవ్వాలని అనుకున్నా.. అందుకే మంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్లా.. చాలా ఎక్కువ ఖర్చు పెట్టా.. అదే మగధీర తీయడానికి ప్రధాన కారణం. అనుకున్నది చేశా.. నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చా.. అదీ తనపై నా ప్రేమ." అంటూ అరవింద్ చెప్పుకొచ్చారు.
44
allu aravind
అయితే అల్లు అరవింగ్ అన్న ఈ మాటలు సైతం ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాయి. చిరుత సినిమా యావరేజ్ ఏంటి మంచి కలెక్షన్లు వచ్చాయ్.. అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు