జిమ్ లో చెమటలు కక్కిస్తున్న జాన్వీ కపూర్.. NTR30లో నాజూగ్గా కనిపించేందుకు హెవీ వర్కౌట్స్..

First Published | Apr 16, 2023, 4:44 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ షాకిస్తోంది. తాజా తన వర్కౌట్ సెషన్ కు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ గా మారింది. 
 

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. సీనియర్ నటి, దివంగత శ్రీదేవి కూతురుగా ఇక్కడ ఆడియన్స్ కు కూడా సుపరిచితమే. ఇప్పటివరకు బాలీవుడ్ లో దుమ్ము లేపిన ఈ బ్యూటీ ఇక టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్30. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తారక్ - జాన్వీ జంటగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాదులో షూటింగ్ కూడా జరుగుతుంది.
 


త్వరలో జాన్వీ కపూర్ కూడా షూటింగ్లో జాయిన్ కాబోతుంది. ఇందుకోసం మరింత స్లిమ్ గా ఎన్టీఆర్30లో కనిపించేందుకు జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తుంది. 70 కేజీ మేరకు బరువులు ఎత్తుతూ ఫ్యాట్ ను కరిగిస్తోంది. తాజా జిమ్ లో జాన్వి కోచ్ ల మధ్య వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.
 

ఇన్స్టా స్టోరీ హ్యాండిల్ లో తన వర్క్ ఔట్ కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరీ కఠినంగా కసరత్తులు చేస్తుoడంతో షాక్ అవుతున్నారు. ఫిట్నెస్ పై జాన్వీ చూపిస్తున్న శ్రద్ధకు ఫిదా అవుతున్నారు. ఆ వీడియోకు లైక్ లు కొడుతున్నారు.
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే జాన్వీ కపూర్ నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. బోల్డ్ ఫోటో షూట్లతో దుమారం రేపుతున్న ఈ బ్యూటీ ఇలా ఫిట్నెస్ వీడియోను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. 
 

ఇప్పటివరకు బాలీవుడ్ లో దుమ్ములేపిన జాన్వీ కపూర్ ఇక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుండడంతో ఈ బ్యూటీ క్రేజ్ సౌత్ లో భారీగా పెరిగే అవకాశం ఉంది. టాలీవుడ్ ఎంట్రీ కూడా విజయవంతం అవడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest Videos

click me!