‘జిగేల్‌ రాణి’ పుట్టిన రోజు స్పెషల్: జిల్లుమనే పర్సనల్ సీక్రెట్స్

First Published Oct 13, 2019, 1:04 PM IST

‘ముకుంద’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే ‘రంగస్థలం’ ఎక్కి ‘జిల్‌.. జిల్‌.. జిగేల్‌ రాణి’ అంటూ కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది.

పుట్టు పూర్వోత్తరాలు: పూజా హెగ్డే పుట్టి, పెరిగింది అంతా కర్ణాటక మంగుళూరులోనే. రణ్‌బీర్‌తో చేసిన యాడ్‌ను అశుతోష్‌ భార్య చూశారు. ‘మొహంజదారో’లోని హీరోయిన్ పాత్రకు నేనైతే సరిపోతానని భావించి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్‌ అవుతానో లేదోనని తెగ టెన్షన్‌పడినా వాళ్లకు నచ్చేయటం ప్లస్ అయ్యింది.
undefined
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్: పూజ కు నటి కావాలన్న ఆలోచన మొదటి నుంచీ లేదు. ఎందుకంటే ఆమె కుటుంబానికీ సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి అనుబంధం లేదు. ఆమె తండ్రి  మంజునాథ్‌ క్రిమినల్‌ లాయర్‌. కానీ, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగంలో స్థిరపడ్డారు. అమ్మ లత ఎంబీఏ చేశారు. అన్నయ్య రిషభ్‌ డాక్టర్‌. ఇలాంటి నేపథ్యంలో నుంచి వచ్చిన పూజ సినిమాలపై దృష్టి పెట్టడం కొద్దిగా విచిత్రమే.
undefined
తెలుగులోకి కాస్త టైమ్..కెరీర్ ప్రారంభంలో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ  తర్వాత మోడలింగ్‌ చేసే అవకాశాలు వచ్చాయి. అప్పుడే తమిళంలో ‘ముగామూడీ’ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చేసింది.
undefined
ఫ్యామిలీ సపోర్ట్: పూజ  ఇండస్ట్రీకి వెళ్తాను అనగానే తల్లి వద్దనలేదు. పూజ చిన్నతనం నుంచి ఆమె  కన్నా ఎక్కువగా నమ్మింది తల్లే. ప్రతి విషయంలో ఆమె ఎంతో సహకరించేది. ‘నువ్వు ఎప్పుడూ హానెస్ట్ గా  ఉండు. ఈ రంగంలో సక్సెస్‌ నీకు తప్పక వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న సంగతి అస్సలు మర్చిపోవద్దు’ అని చెప్తూ స్ఫూర్తి ఇచ్చేది.
undefined
తాతగారి సలహా: పూజకు తాతగారంటే ఇష్టం. ఆయన ఒకటే మాట చెప్పారట..‘‘నీ మాటకు నువ్వు విలువ ఇవ్వు. నీ మాటను నువ్వు గౌరవిస్తే, నీకు గౌరవం దానంతట అదే వస్తుంది. ఒక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే దానికి అర్థం ఉండాలి. మాట మీద నిలబడలేనప్పుడు జీవితానికి అర్థంలేదు. మాట ఇస్తే కచ్చితంగా పాటించు’ అని మా తాత చెప్పేవారట. అదే ఈ స్దితికి తనను తెచ్చిందంటుంది.
undefined
డిజేలో పాత్ర గురించి: ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో  తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తూ....కొన్నిసార్లు  మన స్వభావానికి విరుద్ధమైన పాత్రలు చెయ్యాల్సి వస్తుంది. అది ఒకరకంగా సవాలే!ఔట్‌గోయింగ్, మోడర్న్‌ కారెక్టర్‌ చేశాను. నిజానికి నిజ జీవితంలో నేను రిజర్వ్‌డ్‌గా ఉంటాను. సిగ్గరిని కూడా. అయినప్పటికీ ‘డిజే’లో ఆ క్యారెక్టర్‌లోకి పరకాయప్రవేశం చేశాను. ఇక్కడ ఒక విషయం పంచుకోవాలి... నేను మోడర్న్‌ కాకపోవచ్చుగానీ... నా ఆలోచనలు మాత్రం మోడర్న్‌గానే ఉంటాయి.
undefined
గిటార్ ప్లే: పూజ ఆమె  బ్రదర్‌ నుంచి గిటార్‌ ప్లే చేయడం నేర్చుకుంటున్నా అంటోంది. పాటలు కూడా పాడుతుంంది. అయితే  ఇంకా ప్రావీణ్యం రావాలి.‘‘ఒకేసారి అన్ని పాటలు పాడాలనుకోకు, ఒక పాట పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్న తరువాతే రెండో పాట గురించి ఆలోచించు’’ అని బ్రదర్‌ సలహా ఇచ్చాడు.
undefined
ప్రూవ్ చేసుకోసుకుని నిలబడాలనే..‘‘ఏదో సరదాకి ఒకట్రెండు సినిమాలు చేసి వెనక్కి వెళ్లిపోదామన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి రాలేదంటుంది పూజ. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని చెప్తుంది. మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడకు వచ్చానని...  బిజీగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతా అంటారామె.
undefined
ఫ్లాఫ్ వచ్చింనప్పుడు: హృతిక్ రోషన్ తో చేసిన ‘‘మొహంజదారో’ పెద్ద సినిమా అని రెండేళ్లు డేట్లు ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్. అప్పడు ఆమె ఒంటరిగా కూర్చొని ఏడ్చేసిందిట.
undefined
ఛాలెంజ్ తీసుకున్నా ఫలితం లేదు: హృతిక్ తో చేసిన ‘‘మొహంజదారో’కు ఇటు శారీరకంగా, అటు మానసికంగా చాలా కష్టపడ్డా. షూటింగ్‌ జరిగే ప్రదేశంలో వేడి వాతావరణానికి తోడు ధరించే కాస్ట్యూమ్స్‌ కూడా చాలా బరువుగా ఉండేవి. దాంతో అలసిపోయేదాన్ని. అయితే, ఆ క్యారెక్టర్‌ చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నా..కానీ ఫలితం లేదు’’ అంటుంది పూజ.
undefined
అందుకే ఐటం సాంగ్ చేసా: ‘‘రంగస్థలం’లో  ‘జిల్‌.. జిల్‌.. జిగేల్‌ రాణి’గురించి మాట్లాడుతూ...హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడు ఐటెం సాంగ్‌ చేశానంటే ఆ పాటకున్న ప్రాముఖ్యం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాట నా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్‌ అన్నపేరు వచ్చింది. అలాంటి పాట మరొకటి ఉంటుందని అనుకోను అంటోంది.
undefined
అదృష్టం వల్లే.. పూజ హెడ్గే తను విధిరాతను నమ్ముతాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలి అనేది ముందే డిజైనై ఉంటుందని నా నమ్మకం అని చెప్తోంది. టీనేజ్‌లో బక్కపలచగా ఉండేదాన్ని. నేను సినిమాల్లో నటిస్తానని ఎవరూ అనుకోలేదు. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లాలని నేనూ ఎప్పుడూ అనుకోలేదు. ఇది మాత్రమే కాదు ‘భవిష్యత్‌లో ఇది చేయాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. విధివశాత్తు సినిమా ప్రొఫెషన్‌లోకి వచ్చాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను అంటోందామె.
undefined
ఫిట్నెస్ పిల్ల: తనకన్నా సీనియర్లయిన సమంత, రకుల్, రాశీఖన్నా వంటివారితో సమానంగా టాప్‌గేర్‌లో ఆమె ఫీట్స్‌ చేస్తూ హాటెస్ట్‌ ‘ఫిట్‌క్వీన్‌’గా మారిపోయింది. ఏరియల్‌ సిల్క్‌ మూవ్స్‌ చేస్తూ ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలు ఆమె క్రేజ్‌ని అమాంతం గాల్లోకి లేపాయి. కాలిస్తెనిక్స్, పిలాటిస్, కిక్‌ బాక్సింగ్‌ వంటిì వర్కవుట్స్‌ వీడియోలతో తన ఇన్‌స్టా ఖాతాను ఓవర్‌లోడ్‌ చేసేస్తోందీ బోల్డ్‌ బ్యూటీ.
undefined
ప్రభాస్ సినిమాలో...‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ మూవీ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.
undefined
‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా:మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా ఒక ఐటెంసాంగ్‌ చేస్తున్నా. ఒక్క సాంగ్‌ విషయంలోనే కాదు, హీరోయిన్‌గా నాకు ఇంత కావాలని ఎప్పుడూ ఎవర్నీ డిమాండ్‌ చేయలేదు.’’అని చెప్పింది.
undefined
click me!