దివ్య భారతి నుంచి శ్రీదేవి వరకు.. ఈ తారల మరణాలు ఇప్పటికీ మిస్టరీనే!

First Published May 4, 2020, 1:22 PM IST

ఇటీవల కాలం సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం తరువాత 24 గంటల్లోనే   లెజెండరీ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గతంలోనూ ఇలా అర్ధాంతరంగా మరణించిన సినీ ప్రముఖులను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

ఇండియన్ సినీ అభిమానులను తీవ్రంగా కలిచి వేసిన సెలబ్రిటీ మరణం శ్రీదేవిది. 2018 ఫిబ్రవరి 24న ఓ వివాహ వేడుకకు విదేశాలకు వెళ్లిన శ్రీదేవి అక్కడే బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయింది. అయితే ఆమె మరణం విషయంలో ఎన్నో అనుమానులు ఇప్పటికీ అభిమానులను వేదిస్తూనే ఉన్నాయి.
undefined
నటిగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న వీజే నఫీసా జోసెఫ్ 2004 జూలై 29న అర్ధాంతరంగా తనువు చాలించింది. తన అపార్ట్‌మెంట్‌లోనే ఆమె ఊరి వేసుకొని మరణించిందని పోలీసులు వెళ్లడించారు. తన పెళ్లి ఆగిపోవటంతో డిప్రెషన్‌కు గురై ఆమె ఆత్మ హత్య చేసుకుందని భావిస్తున్న అసలు విషయం మాత్రం బయటకు రాలేదు.
undefined
పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన మహేష్ ఆనంద్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. తన ఇం ట్లోనే ప్రాణం లేని స్థితిలో ఆయన శవాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒంటరితనం కారణంగానే ఆయన మృతి చెందినట్టుగా భావిస్తున్నారు.
undefined
ప్రముఖ కమెడియన్‌ కవి కుమార్ ఆజాద్ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన హర్ట్ ఎటాక్‌తోనే మరణించినట్టుగా తేల్చినా ఇప్పటికీ అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి.
undefined
బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ఓం పురి మరణం విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. మరణించిన తరువాత ఆయన తలపై తీవ్రగాయం ఉన్నట్టుగా గుర్తించారు.
undefined
బాలీవుడ్‌ నటి పర్వీన్ బాబీ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చాలాకాలంగా మాదక ద్రవ్యాలకు బానిస అయిన ఆమె తన అపార్ట్‌మెంట్‌లోనూ మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
undefined
మరో బాలీవుడ్‌ నటుడు ఇంద్రకుమార్ మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయన చిన్న వయసులోనే నిద్రలోనే కన్నుమూయటం అభిమానులను కలచి వేసింది.
undefined
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షమ్మీ కపూర్ మొదటి భార్య గీతా బాలి 1965లో మశూచి కారణంగా మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె మృతి పట్ల అభిమానుల్లో మాత్రం అనుమానాలు ఉన్నాయి.
undefined
బాలనటిగా పలు సినిమాల్లో ప్రకటనల్లో కనిపించిన తరుణి 2012లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మరణించింది.
undefined
50, 60లలో బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా ఎదిగిన గురుదత్‌, 39 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకొని మరణించాడు.
undefined
వెండితెర మీద తిరుగులేని తారగా వెలుగొందుతున్న సమయంలోనే 1969లో మధుబాల అర్థాంతరంగా తనువు చాలించింది.
undefined
ప్రేమికుల రోజు సినిమాతో పాపులర్ అయిన హీరో కృపాల్, వరుస ఫెయిల్యూర్స్‌ కారణంగా డిప్రెషన్‌కు లోనై ఆత్మ హత్య చేసుకున్నాడు.
undefined
ఇండియన్‌ ఐడల్ 2 విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు సందీప్ ఆచార్య జాండీస్‌తో చికిత్స పొందుతూ మరణించాడు.
undefined
బాలీవుడ్‌ నటి దివ్యభారతి మరణం కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఆమె 19 ఏళ్ల వయసులోనే తన అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కింద పడి మరణించింది.అయితే ఆమె మరణం ప్రమాదం కాదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
undefined
వెండితెర మీద టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న తరుణంలో నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే మరణం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి.
undefined
వెండితెర మీద సెగలు పుట్టించిన శృంగార తార సిల్క్‌ స్మిత మరణంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. డేరింగ్ అండ్‌ డాషింగ్ ఉమెన్‌గా పేరున్న సిల్క్‌ స్మిత ఆత్మ హత్య చేసుకోవటంపై సినీ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
undefined
నటి జియా ఖాన్‌ మరణం బాలీవుడ్‌ను కుదిపేసింది. యంగ్ హీరో సూరజ్‌ పంచోలితో ఎఫైర్‌ కారణంగానే ఆమె మరణించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
undefined
హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న తరుణంలోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చినా.. ఆమెది హత్య అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
undefined
యువ నటుడు ఉదయ్ కిరణ్ మరణం మీద కూడా పలు అనుమానాలు ఉన్నాయి. హీరోగా కెరీర్‌ అంతగా ఫాంలో లేకపోవటంతో డిప్రెషన్‌కు లోనైన ఉదయ్‌ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
undefined
click me!