ఇక మరో హీరోయిన్ మయూరి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మయూరి అంటే అర్ధం కాకపోవచ్చు కాని . మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. ఐఐటి ఖరగ్ పూర్ లో చదువుకున్న మయూరి తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత, సినిమాల్లో అవకాశాలు తగ్గడం తో జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో స్పెషల్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియా లో కీలకమైన ఉద్యోగంలో ఉన్నారు.