నాకు, పవన్ కి మధ్య ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.. అలీ కామెంట్స్

First Published Jun 1, 2020, 4:13 PM IST

కమెడియన్ అలీ టాలీవుడ్ లో సీనియర్ నటుడు. బాల్యం నుంచే నటన మొదలు పెట్టిన అలీ అంచలంచెలుగా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వందలాది చిత్రాల్లో తన హాస్యంతో నవ్వులు పూయించాడు.

కమెడియన్ అలీ టాలీవుడ్ లో సీనియర్ నటుడు. బాల్యం నుంచే నటన మొదలు పెట్టిన అలీ అంచలంచెలుగా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వందలాది చిత్రాల్లో తన హాస్యంతో నవ్వులు పూయించాడు. తాజాగా అలీ లాక్ డౌన్ నేపథ్యంలోమీడియాతోతన మనసులో విషయాలని పంచుకున్నాడు.
undefined
అలీ ఇంటర్వ్యూలోపవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఫ్రెండ్ షిప్ ఎలా మొదలైంది అనే సంగతులని అలీ పంచుకున్నాడు. తానూ చిరంజీవి గారిని కలిసేందుకు తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లోకి రాలేదు.
undefined
తానూఇంటికి వెళ్ళగానే.. కూర్చోండిఅన్నయ్య ఇప్పుడే వచ్చారు.. కాఫీ తీసుకుంటారా, టీతీసుకుంటారా అని మర్యాదగా అడిగేవారు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో నేను నటించా. ఆయన తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, చివరగా నటించిన అజ్ఞాతవాసి మినహా మిగిలిన అన్ని చిత్రాల్లో తాను పవన్ తో కలసి నటించినట్లు అలీ తెలిపారు.
undefined
గోకులంలో సీతతో తమ ప్రయాణం ప్రారంభం అయింది. ఆ తర్వాత సుస్వాగతం, సూపర్ హిట్ గా నిలిచిన తొలిప్రేమచిత్రంతో తమ కాంబినేషన్ బలపడినట్లు అలీ తెలిపాడు.
undefined
ఇక పవన్ అలీనిచూసిన ప్రతి సారీ నవ్వుతుంటారు. అందుకు గల కారణాన్నిఅలీ వివరించాడు. నా కామెడీ టైమింగ్, హావా భావాలుపవన్ కళ్యాణ్ గారికిబాగా ఇష్టం. మేము వేదికపై ఉన్నప్పుడు సీక్రెట్ గా సైగలు చేసుకుంటాం. మా మధ్య ఏం జరుగుతుందో ఎవరికీతెలియదు అని అలీ తెలిపాడు.
undefined
ఇక చిరంజీవి గారి ఫ్యామిలీతో తాను, బ్రహ్మానందం గారు చాలా క్లోజ్ అని అలీ తెలిపాడు. పవన్, అన్నయ్య చిరంజీవి ఇద్దరికీ బ్రహ్మానందం అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం అన్నయ్య ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి వస్తుంది అని తెలిపాడు.
undefined
అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఫామ్ లో సేంద్రియ పద్ధతుల్లో పండించినమామిడి పండ్లు పంపుతారు. ఈ సంవత్సరం ఆయన పాలిటిక్స్ తో బిజీగా ఉండడంవల్ల పంపలేదు. బహుశా వచ్చే సంవత్సరం పంపుతారేమో అని అలీ అన్నాడు.
undefined
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య విభేదాలు తెలెత్తినసంగతి తెలిసిందే. పవన్ అలీని విమర్శించడం.. ఆ విమర్శలకు అలీ బాధపడుతూ కామెంట్స్ చేయడం జరిగింది.
undefined
click me!