మన భారతీయ సినిమా ఇండస్ట్రీ కి కరోనా లాక్ డౌన్ శాపం తగిలినట్లుంది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరుగా కాలం చేసారు. కారణాలేవైనా మన నటులు మాత్రం మరణించారు. తొలుత ఇర్ఫాన్ ఖాన్ తో మొదలైన నటుల మరణం, నేడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు చేరింది.
తొలుత ఈ లాక్ డౌన్ మొదలవగానే ఇర్ఫాన్ ఖాన్ మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. పద్మశ్రీ అవార్డు పొందిన ఈ సూపర్ స్టార్... కాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆయన గత కొన్నాళ్లుగా కాన్సర్ పై పోరాటం చేస్తున్నాడు. ఏప్రిల్ 28వ తేదీనాడుఆయన తన ఆరోగ్య బాగా క్షీణించడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. తెల్లారి మరణించారు. తన నటనతో, ముక్కుసూటితనంతో ఇర్ఫాన్ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
మే 23వ తేదీనాడు హిందీ రెడీ సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన మోహిత్ భాగేల్ కాన్సర్ తో చికిత్స పొందుతూ మరణించాడు.
జూన్ 1వ తేదీనాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సాజిద్- వాజిద్ లలో ఒకరు. వాజిద్ ఖాన్ కరోనా మహమ్మారి బారినపడి మరణించాడు. కేవల42 సంవత్సరాల వయసులోనే మరణించాడు.చిన్న వయసులోను వాజిద్ మరణించటంతో ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాజిత్ వాజిద్ ద్వయం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అయితే వాజిద్ కొంత కాలంగా కిడ్నీకి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ కూడా జరిగింది. సల్మాన్ ఖాన్‌కు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించాడు వాజిద్. ఇటీవా భాయ్ భాయ్ అంటూ సాగే పాటను కూడా వాజిద్ కంపోజ్ చేశాడు.
జూన్ నాలుగవ తేదీన సీనియర్ దర్శకుడు బసు ఛటర్జీ మరణించాడు. దాదాపుగా 90 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. రజనీగంధ, చిత్ చోర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
మూడు రోజుల వ్యవధిలోనే కన్నడ సూపర్ స్టార్, యువ నటుడు చిరంజీవి సర్జ మరణించాడు. సీనియర్ హీరో అర్జున్ బంధువు సాండల్ వుడ్ యంగ్ హీరో చిరంజీవి సర్జ చిన్న వయసులో గుండె పోటుతో మృతి చెందాడు. అతని వయసు కేవలం 39 సంవత్సరాలే.
ఇక ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై సినిమా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.సూపర్ హిట్ హిందీ సీరియల్ పరిత్రా రిష్తా తో ఎంతో పాపులారిటీ సాధించాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఆ షో తో వచ్చిన పాపులారిటో 2013లో కై పో చే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా పీకేలోనూ కీలక పాత్రలో నటించాడు సుశాంత్.