మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

First Published Dec 9, 2019, 5:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో సంగీత దర్శకులతో పనిచేశారు. తన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తూనే.. పాటలు, డాన్సులు అభిమానులని అలరించేలా మెగాస్టార్ జాగ్రత్త పడేవారు. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ మొదలయ్యాక సంచలనాలు నమోదయ్యాయి.

బావగారూ బాగున్నారా: మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన తొలి చిత్రం బావగారూ బాగున్నారా. 1998లో విడుదలైన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తొలి చిత్రంతోనే మణిశర్మ చిరంజీవి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేశారు.
undefined
చూడాలని ఉంది: 1998లోనే బావగారూ బావున్నారా విడుదలైన కొన్ని నెలలకే చూడాలని ఉంది చిత్రం రిలీజయింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. మణిశర్మ సంగీతం అందరగొట్టాడు. ఆ ఏడాది చూడాలని ఉంది ఆడియో క్యాసెట్స్ విక్రయాలు రికార్డ్స్ రికార్డ్స్ సృష్టించాయి.
undefined
చిరంజీవి రాంగ్ అని ప్రూవ్ చేశాడు: చూడాలని ఉంది చిత్రంలో మణిశర్మ, చిరు మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రంలోని రామా చిలకమ్మా సాంగ్ ఒక ఊపు ఊపింది. కానీ ఈ పాట చిరంజీవికి నచ్చలేదు. ఈ సాంగ్ ని సింగర్ ఉదిత్ నారాయణ్ పాడారు. అతడి వాయిస్ చిరుకి నచ్చలేదు. మార్చమని మణిశర్మని కోరాడు. కానీ మణిశర్మ అతడి వాయిసే బావుంది సర్. సాంగ్ సూపర్ హిట్ అవుతుంది నన్ను నమ్మండి అని చిరుకి చెప్పాడు. అయినా నమ్మకం కుదర్లేదు. దీనితో మణిశర్మ చిత్ర యూనిట్ లోని అందరి ఒపీనియన్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ సాంగ్ బావుందని చెప్పారు. దీనితో చిరంజీవి కూడా కన్విన్స్ అయ్యారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ కావడం రామా చిలకమ్మ సాంగ్ సెన్సేషన్ గా మారడం జరిగింది. అలా మణిశర్మ చిరంజీవి కూడా రాంగ్ అని ఆ సందర్భంలో ప్రూవ్ చేశాడు.
undefined
ఇద్దరు మిత్రులు: చిరు, మణిశర్మ హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం జస్ట్ యావరేజ్.
undefined
అన్నయ్య: 2000 సంవత్సరంలో విడుదలైన అన్నయ్య చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
undefined
మృగరాజు: భారీ అంచనాల నడుమ విడుదలైన మృగరాజు చిరంజీవి కెరీర్ లోనే బిగ్ డిజాస్టర్. మణిశర్మ సంగీతం కూడా మెప్పించలేకపోయింది.
undefined
ఇంద్ర: మృగరాజు చిత్రం కసిని పెంచిందో ఏమో కానీ.. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర చిత్రంలో మణిశర్మ దుమ్ముదులిపేశాడు. ఈ చిత్రంలోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ సెన్సేషన్. మణిశర్మ అందించిన బాణీలకు చిరంజీవి డాన్స్ తో చెలరేగిపోయారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
ఠాగూర్: ఇంద్ర సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ.. ఠాగూర్ చిత్రానికి కూడా మణిశర్మ అదిరిపోయే సంగీతం అందించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ కి ముందు వచ్చే 'నేను సైతం' అనే సాంగ్ ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని పెంచింది.
undefined
అంజి: అంజి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పాటలు కూడా యావరేజ్ గానే ఉంటాయి. కానీ మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతానికి మాత్రం ప్రశంసలు దక్కాయి.
undefined
జై చిరంజీవ: జై చిరంజీవి చిత్రం నిరాశపరిచినప్పటికీ మణిశర్మ మంచి ఆల్బమ్ అందించాడు. ఈ చిత్రంలో జై జై గణేష్ సాంగ్ వినాయక చవితి ఉత్సవాల్లో తప్పనిసరిగా మారిపోయింది.
undefined
స్టాలిన్: చిరు, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం స్టాలిన్. కమర్షియల్ గా యావరేజ్ గా నిలిచిన మూవీ మ్యూజిక్ పరంగా ఆకట్టుకుంది.
undefined
చిరు 152: దాదాపు 13 ఏళ్ల తర్వాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. కొరటాల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో రిలీజ్ కానుంది.
undefined
click me!