హీరో వడ్డే నవీన్ పేరు చెప్పగానే పెళ్లి, చాలా బాగుంది, ప్రియా ఓ ప్రియా లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 2000 సంవత్సరం ఆరంభం వరకు వడ్డే నవీన్ నటుడిగా మంచి జోరు ప్రదర్శించాడు. ఆ తర్వాత నవీన్ క్రమంగా వెండి తెరకు దూరమవుతూ వచ్చాడు. తాజాగా వడ్డే నవీన్ ఫ్యామిలిలో జరిగిన శుభకార్యానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుక ఘనంగా జరిగింది.