ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ వైరస్ భయంతో ఇంటికి పని మనుషులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవటంతో తారలంతా ఇంటి పనిలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే తొటమాలిగా మారితే.. అందాల భామ పాయల్ రాజ్ పుత్ ఇంటి పనిలో మునిగితేలుతోంది. రకుల్ తమ్ముడితో సరదాగా ఆటలాడుతుంటే.. రష్మిక తన పెంపుడు కుక్కతో కాలం గడుపుతోంది.