మా నాన్న లేకుంటే రిలీజ్ కష్టమే.. నేను గుర్తులేనా, మంచు విష్ణుతో జెనీలియా

First Published Apr 14, 2020, 2:07 PM IST
మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు 2003లో నటుడిగా పరిచయం అయ్యాడు. కానీ విష్ణుకి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం 2007లో. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రంతో మంచు విష్ణు ఘనవిజయం సొంతం చేసుకున్నాడు.
మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు 2003లో నటుడిగా పరిచయం అయ్యాడు. కానీ విష్ణుకి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం 2007లో. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఢీ చిత్రంతో మంచు విష్ణు ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో విష్ణుకి జోడిగా అందాల మెరుపు తీగ జెనీలియా నటించింది.
undefined
ఢీ చిత్రం విడుదలై సోమవారానికి 13 ఏళ్ళు గడిచింది. ఈ సంధర్భంగా విష్ణు, దర్శకుడు శ్రీని వైట్ల, జెనీలియా సోషల్ మీడియావేదికగా తమ అనుభవాలు పంచుకున్నారు. చాలా కాలం తర్వాత విష్ణు, జెనీలియా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
undefined
విష్ణు ట్వీట్ చేస్తూ.. ఢీ చిత్రం విడుదలై 13 ఏళ్ళు గడిచింది. 2007 ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు మా టీమ్ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను. మా నాన్న మోహన్ బాబు గారు లేకుంటే ఈ చిత్రం ఎప్పటికీ విడుదలై ఉండేది కాదు.ఇదికల్ట్ యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రాన్ని అన్నీ నా సోదరుడు శ్రీను వైట్లనే. ఢీ 2 ఎప్పుడు అంటూ విష్ణు శ్రీనువైట్లని ప్రశ్నించాడు.
undefined
అదే సమయంలో జెనీలియా ట్వీట్ చేస్తూ నీకు నేను గుర్తు లేనా విష్ణు అని ప్రశ్నించింది. దీనికి విష్ణు బదులిస్తూ.. ఈ ఫొటో చూశావా.. నువ్వు చాలా అందంగా ఏంజిల్ లా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు నిన్ను ఎప్పటికి మరచిపోలేను అని విష్ణు జెనీలియాకు బదులిచ్చాడు.
undefined
శ్రీనువైట్ల కూడా ఢీ చిత్ర అనుభవాలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా కెరీర్ లో ఇది స్పెషల్ మూవీ. ప్రతికూల పరిస్థితుల్లో షూట్ చేశాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ ఓ మధుర జ్ఞాపకమే. ఈ చిత్ర నిర్మాత, నా స్నేహితుడు ఎమ్ ఎస్ ఎన్ రెడ్డికి కృతజ్ఞతలు అని శ్రీనువైట్ల ట్వీట్ చేశారు.
undefined
ఇక ఈ చిత్ర సీక్వెల్ ఢీ 2 గురించి చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో విష్ణుని ఢీ 2 గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకి నా సోదరుడు శ్రీను వైట్లగారే సమాధానం చెప్పాలి అని అన్నాడు.
undefined
click me!