టీమిండియాలో లుకలుకలు: రోహిత్, కోహ్లీ చెరో క్యాంప్

First Published Jul 13, 2019, 3:12 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ పై ఓడిపోవడంతో టీమిండియాపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైన, ధోనీ ఆట తీరుపైన ఈ విమర్శలు వస్తున్నాయి. టీమిండియాలో లుకలుకలున్నాయని, జట్టు రెండు చీలిపోయిందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ పై ఓడిపోవడంతో టీమిండియాపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైన, ధోనీ ఆట తీరుపైన ఈ విమర్శలు వస్తున్నాయి. టీమిండియాలో లుకలుకలున్నాయని, జట్టు రెండు చీలిపోయిందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
undefined
జట్టులో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెరో క్యాంప్‌ నడుపుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ ఆటగాడు ధ్రువీకరించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక వర్గం కోహ్లీవైపు ఉండగా మరో వర్గం రోహిత్‌వైపు ఉన్నట్టు ఓ ఆటగాడు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. రిషబ్ పంత్ ఎక్కడున్నాడో చూశారు కదా అని రోహిత్ శర్మ వ్యంగ్యంగా అనడాన్ని బట్టి ఆ విషయం అర్థమవుతుందని కూడా అంటున్నారు.
undefined
కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మధ్య కూడా సయోధ్య లేదనే విషయం కూడా వెలుగులోకి వస్తోంది. వీరిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే జట్టులో అంతర్గత విభేదాలకు పురుడు పోసిందని అంటున్నారు. ప్రపంచ కప్ టోర్నీకి అంబటి రాయుడును కాదని విజయ్‌ శంకర్‌ ను ఎంపిక చేయడమే దానికి ఉదాహరణగా చెబుతున్నారు
undefined
కోహ్లీకి సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మద్దతు పుష్కలంగా ఉందని, దాంతో కోహ్లీ నిర్ణయాలను ఎవరు కూడా వ్యతిరేకించలేకపోతున్నారని అంటున్నారు. కోచ్‌ కుంబ్లే విషయంలో కోహ్లీ పంతం నెగ్గడానికి కూడా అదే కారణమని అంటున్నారు. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయినా కోహ్లీనితప్పు పట్టకపోవడానికి కూడా కారణం అదేనంటున్నారు.
undefined
కోహ్లీకి సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లకే ఎంపికలో ప్రాధాన్యం లభిస్తోందనే మాట వినిపిస్తోంది.ఫామ్‌లో లేకపోయినా కెఎల్ రాహుల్ జట్టులోకి రావడానికి విరాట్ కోహ్లీ కారణమని అంటున్నారు. స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో కోహ్లీకి ఉన్న సంబంధాల వల్లనే ఎంపికయ్యాడని విమర్శిస్తున్నారు
undefined
అంబటి రాయుడు జట్టులోకి రాకూడదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బలంగా కోరుకుందని కూడా పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఆటగాడు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైతే దాన్ని చూపించి అతడిని జట్టు నుంచి తప్పించే అవకాశం కోసం వారు ఎదురుచూసినట్లు తెలుస్తోంది.
undefined
click me!