విరాట్ కోహ్లీ నా కెప్టెన్! వరల్డ్ కప్‌కి ఎందుకు సెలక్ట్ కాలేదో తెలియక ఏడ్చేశా! ఇప్పటిదాకా ఎవ్వరినీ అడగలేదు..

Chinthakindhi Ramu | Published : Jul 18, 2023 12:19 PM
Google News Follow Us

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేయకపోవడం ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశంగానే మిగిలింది. పొట్టి ఫార్మాట్‌కి దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ని టీ20 ఫార్మాట్‌లోకి తిరిగి తీసుకొచ్చిన సెలక్టర్లు, నాలుగేళ్లుగా వైట్‌ బాల్ ఫార్మాట్‌లో టీమ్‌కి ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చిన చాహాల్‌ని పూర్తిగా పక్కనబెట్టేశారు..
 

18
విరాట్ కోహ్లీ నా కెప్టెన్! వరల్డ్ కప్‌కి ఎందుకు సెలక్ట్ కాలేదో తెలియక ఏడ్చేశా! ఇప్పటిదాకా ఎవ్వరినీ అడగలేదు..

ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ తీసి, ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తిని... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు.. అతనితో పాటు రాహుల్ చాహార్, రవిచంద్రన్ అశ్విన్‌లను స్పిన్నర్లుగా ఎంపిక చేశారు..

28
Sanju Samson and Chahal

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో టీమిండియా, మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. అది కూడా ఒక్క వికెట్ తీయలేక 10 వికెట్ల తేడాతో ఓడి పరువు పోగొట్టుకుంది...

38
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్ కావాలని అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లను కోరినా వాళ్లు పట్టించుకోలేదు. మెంటర్ మాహీ చెప్పిన వాళ్లకే టీమ్‌లో చోటు కల్పించారని వార్తలు వచ్చాయి. పూర్తి ఫిట్‌గా లేకపోయినా హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్ కప్ 2021 ఆడడానికి మాహీయే కారణం..
 

Related Articles

48
Image credit: PTI

‘నాకు బాధొచ్చినా, దుఃఖం వేసినా వెంటనే ఏడ్చేశా. లేదంటే ఆ బాధ నన్ను తొలిచేస్తూ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక కాకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటిదాకా నేను టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి టాప్ వికెట్ టేకర్‌ని కూడా..

58
Chahal

అయినా వరల్డ్ కప్‌కి ఎంపిక కాకపోవడంతో చాలా బాధేసింది. వెంటనే బాత్‌రూమ్‌కి వెళ్లి ఏడ్చేశా. ఆ సమయంలో ధనశ్రీ నాతో ఉంది. తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు దుబాయ్ వెళ్లాలి. వారం రోజులు క్వారంటైన్‌లో ఉన్నాం..

68

పరిస్థితులు బాగుంటే బయటికి వెళ్లి, అలా ఇలా తిరిగి ఏదోలా మరిచిపోయేవాడిని. వారం రోజులు అలా రూమ్‌లో కూర్చోవాలంటే భయమేసింది. దేవుడి దయ వల్ల ధనశ్రీ నాతోనే ఉంది. తన వల్లే నేను నా కోపాన్ని, బాధను అణుచుకున్నా.. తను లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది..
 

78
Yuzvendra Chahal

మేం ఇద్దరం కలిసి ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లం, సినిమాలు చూస్తూ రిలాక్స్ అయ్యేవాళ్లం. అయినా అప్పుడు నేను ఆర్‌సీబీలో ఉన్నా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే నా కెప్టెన్. అయినా నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో నాకు అర్థం కాలేదు..

88
Image credit: PTI

నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదో ఎవరినీ అడగలేదు. అడగాలని కూడా అనిపించలేదు. జరిగిందేదో జరిగిపోయింది, ఐపీఎల్‌పైన ఫోకస్ పెట్టమని ధనశ్రీ చెప్పింది. నా కోపాన్ని గ్రౌండ్‌లోనే చూపించమని సలహా ఇచ్చింది. తను చెప్పిందే నిజమని అనిపించింది. నా క్రికెట్ కెరీర్‌లో అవి చీకటి రోజులు...’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్.. 

Read more Photos on
Recommended Photos