ఆ రోజు ఫ్లింటాఫ్ ఓ మాట అన్నాడు, అంతే... కోపంతో సిక్సర్లు బాదేశా... మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...

Published : Jun 11, 2021, 10:27 AM IST

టీ20ల్లో సంచలన ఇన్నింగ్స్ 2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్‌పై నమోదుచేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరుకి ఆరు సిక్సర్లు బాది, సరికొత్త రికార్డు లిఖించాడు యువీ. అయితే యువరాజ్ సిక్సర్ల మోత వెనకాల చాలా పెద్ద కథే ఉంది...

PREV
19
ఆ రోజు ఫ్లింటాఫ్ ఓ మాట అన్నాడు, అంతే... కోపంతో సిక్సర్లు బాదేశా... మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ జట్టుకి ఆండ్రూ ఫ్లింటాఫ్ కెప్టెన్‌గా వ్యవహారించిన విషయం తెలిసిందే. నోటి దురుసు ఎక్కువగా ఉండే ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్‌ని సెడ్జింగ్ చేశాడు. వీరిద్దరూ గొడవ పడడంతో టీవీల్లో కూడా కనిపించింది...

29

ఆ సంఘటన తర్వాతే గేర్ మార్చిన యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు. తాజాగా ఆ రోజు ఫ్లింటాఫ్, తనతో ఏమన్నాడో బయటపెట్టాడు యువీ...

39

‘ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టా. ఆ షాట్స్‌తో అతను అసహనానికి గురయ్యాడు. లాస్ట్ బాల్ వేసిన తర్వాత నడుచుకుంటూ వెళుతూ నన్ను సెడ్జింగ్ చేశాడు... చెత్త షాట్స్ ఆడావు అంటూ హేళన చేశాడు...

49

ఆ మాటకు నాకు కోపం వచ్చింది. నేను కూడా గట్టిగా బదులు ఇచ్చా. అంతే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఫ్లింటాఫ్, చాలా కోపంగా నీ గొంతు కోస్తానంటూ బెదిరించాడు. నేను నా బ్యాటుని చూపించి, దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చా...

59

ఈ సంఘటన తర్వాతే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నా. ఆ తర్వాతే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కి వచ్చాడు. ప్రతీ బంతినీ స్టేడియం బయటపడేయాలనేంత కసిగా బాదాను... నిజానికి ఆ రోజు నేను ఆడిన షాట్స్‌లో కొన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ ఆడనివి....

69

స్టువర్ట్ బ్రాడ్‌కి అప్పటికీ పెద్దగా అనుభవం లేదు. అయితే నన్ను కంట్రోల్ చేయడానికి అతను చాలా ప్రయత్నించాడు. యార్కర్లు వేసినా సరే, నేను వాటిని సిక్సర్లుగా మలచగలిగా....

79

ఆఖరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూసి ఓ నవ్వు నవ్వాను. అప్పటికే అతని ముఖం మాడిపోయి ఉంది.... నేను అలా ఆడతానని అతను అస్సలు ఊహంచలేదు. నిజానికి నేను కూడా ఆ ఇన్నింగ్స్ ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్...

89

ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన యువరాజ్ సింగ్, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదుచేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు... 

99

యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించడంతో భారత్ 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 200 పరుగులు చేయగలిగింది. 

click me!

Recommended Stories