విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్ సరసన చేరిన యశ్ ధుల్... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో...

Published : Feb 03, 2022, 03:11 PM IST

అండర్-19 ఆసియా కప్ టోర్నీ గెలిచి, ఆ జోరుతో వరల్డ్‌ కప్ టోర్నీని ఆరంభించిన భారత యువ జట్టు, సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది... సెమీస్‌లో సెంచరీ బాదిన అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్, అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు...

PREV
17
విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్ సరసన చేరిన యశ్ ధుల్... అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో...

క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి, గత అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత యువ జట్టు...

27

సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 95 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు, వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. 2016, 2018, 2020 సీజన్లలో ఫైనల్ చేరిన భారత జట్టు, వరుసగా నాలుగో సీజన్‌లోనూ టైటిల్ ఫైట్‌లో నిలిచింది...

37

మరో వైపు పాకిస్తాన్ జట్టు వరుసగా నాలుగో అండర్-19 వరల్డ్‌ కప్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 2014లో ఫైనల్ చేరిన పాకిస్తాన్, ఆ తర్వాత తుదిపోరుకి అర్హత సాధించలేకపోయింది...

47

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 110 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 110 పరుగులు చేసిన కెప్టెన్ యశ్ ధుల్, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు...

57

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు యశ్ ధుల్. ఇంతకుముందు 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్ చంద్ ఈ ఘనత సాధించారు...

67

విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్‌తో పాటు యశ్ ధుల్ కూడా ఢిల్లీకి చెందిన వాళ్లే కావడం విశేషం. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత కరోనా బారిన పడిన యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్... కోలుకుని మంచి ఇన్నింగ్స్‌లతో కమ్‌బ్యాక్ ఇవ్వడం విశేషం... 

77

1998లో అండర్-19 వరల్డ్‌కప్ సాధించిన ఇంగ్లండ్, ఆ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఫైనల్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే రెండో టైటిల్ సొంతం చేసుకుంటుంది. అదే భారత జట్టు విజయం సాధిస్తే ఐదో టైటిల్‌తో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంటుంది...

Read more Photos on
click me!

Recommended Stories