Published : Feb 12, 2023, 02:29 PM ISTUpdated : Feb 12, 2023, 02:56 PM IST
టీమిండియా 20 వరల్డ్ కప్ టోర్నీ గెలిచి 16 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత 14 సార్లు (మెన్స్, ఉమెన్స్ కలిపి) టీ20 వరల్డ్ కప్ టోర్నీలు జరిగినా టైటిల్ మాత్రం దక్కలేదు. గత రెండు టోర్నీల్లోనూ టీమిండియాకి నిరాశే ఎదురైంది... మరోసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బరిలో దిగనుంది భారత జట్టు..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో హాట్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన టీమిండియా, గ్రూప్ స్టేజీ కూడా దాటలేకపోయింది. పాకిస్తాన్ చేతుల్లో మొట్టమొదటి వరల్డ్ కప్ పరాజయాన్ని చవి చూసి, పరాభవంతో ఇంటి దారి పట్టింది...
28
విరాట్ వల్ల కాలేదని రోహిత్ శర్మకి కెప్టెన్సీ అప్పగిస్తే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. విరాట్ కెప్టెన్సీలో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది...
38
Smriti Mandhana-Harmanpreet Kaur
ఇప్పుడు మరోసారి టీమిండియా, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈసారి బరిలో దిగితే పురుషుల జట్టు, భారత మహిళా క్రికెట్ టీమ్...కారణం రన్నరప్‌గా ఈ సారి టోర్నీని ప్రారంభిస్తోంది టీమిండియా...
48
ధోనీ కెప్టెన్సీలో భారత పురుషుల జట్టు 2014లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది. 2020 సీజన్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. అయితే ఫైనల్‌లో 85 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది...
58
Image credit: PTI
అండర్19 టీ20 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన భారత మహిళా జట్టు, అదే రేంజ్ పర్ఫామెన్స్‌ని అసలైన సీనియర్స్ టీ20 వరల్డ్ కప్‌లోనూ చూపిస్తే టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు..
68
ఉమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే టీమిండియాకి ఎదురైన ఏకైక పరాజయం పాక్‌తోనే. అదే పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్..
78
అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టీమ్‌ని నడిపించిన షెఫాలీ వర్మతో పాటు యషికా భాటియా, స్మృతి మంధాన, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఇలా భారత జట్టు పటిష్టంగా ఉంది...
88
Harmanpreet-Dhoni-Shafali
అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కానిది, హర్మన్‌ప్రీత్ కౌర్ గెలవగలదా? అనేది పక్కనబెడితే... ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు భారత మహిళా జట్టు, టీ20 వరల్డ్ కప్ గెలిస్తే, అది... భారత్‌లో మహిళా క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ తీసుకురావడం మాత్రం గ్యారెంటీ...