పురుషుల ఐపీఎల్ జరుగుతున్న యూఏఈలోనే మహిళల ఐపీఎల్ కూడా జరగనుంది.
మూడు జట్ల మధ్య జరిగే మహిళల ఐపీఎల్, కేవలం నాలుగు మ్యాచులతోనే ముగియనుంది.
సూపర్ నోవాస్ జట్టుకు వన్డే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వెలాసిటీ జట్టుకు మిథాలీరాజ్ కెప్టెన్లుగా వ్యవహారించబోతున్నారు.
యంగ్ సెన్సేషన్ ప్లేయర్ స్మృతి మంధాన ట్రెయిల్ బ్లేజర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతోంది.
మహిళల ఐపీఎల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడబోతున్నారు.
మొదటి మ్యాచ్‌లో నవంబర్ 4న సూపర్ నోవాస్ వర్సెస్ వెలాసిటీ మ్యాచ్ జరగనుంది...
రెండో మ్యాచ్‌లో నవంబర్ 5న వెలాసిటీ, ట్రెయిల్ బ్లేజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది...
మూడో మ్యాచ్‌లో నవంబర్ 7న ట్రెయిల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్‌ను ఢీకొనబోతుంది.
రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ చేరిన టాప్ 2 జట్ల మధ్య నవంబర్ 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది...
Sreeharsha Gopagani