IPL 2020: ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా... స్కోరు ముందే ఎలా ట్వీట్ చేశారు...

First Published Oct 12, 2020, 5:07 PM IST

IPL చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో 100కి పైగా విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంపైర్లకు డబ్బులు ఇస్తారని, ఆఖరి నిమిషంలో మ్యాచ్ రిజల్ట్ మార్చేస్తారని ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ ఆరోపణలకు మరింత పెట్రోల్ పోసింది ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాలో వేసిన ఓ ట్వీట్...

ఐపీఎల్‌లో ప్రతీ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాను మెయింటైన్ చేస్తూ రెగ్యూలర్‌గా పోస్టులు షేర్ చేస్తున్నారు...
undefined
తాజాగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి సంబంధించి అధికారిక ఖాతా నుంచి అప్‌డేట్స్ వేసింది ముంబై.
undefined
అయితే పొరపాటున మ్యాచ్ ప్రారంభంలోనే ఢిల్లీ చేయబోయే స్కోరును పోస్టు చేసింది ముంబై ఇండియన్స్.
undefined
7:38 నిమిషాలకు వేసిన ఈ ట్వీట్‌లో 19.5 ఓవర్లలో 1635 పరుగులు చేస్తుందని ట్వీట్ చేశారు.
undefined
మ్యాచ్ ముగిసేసమయానికి 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
దీంతో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని, అందుకే ఫిక్స్ చేసిన టార్గెట్‌కి చాలా దగ్గరగా ఢిల్లీ స్కోరు చేసిందని అంటున్నారు నెటిజన్లు...
undefined
మొదట బ్యాటింగ్ చేసిన ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఢిల్లీ, స్వల్ప స్కోరుకే పరిమితం కావడం కూడా అనుమానాలకు తావిస్తోంది..
undefined
భారీ షాట్లతో విరుచుకుపడే స్టోయినిస్ పొరపాటున రన్‌ అవుట్ కావడం వంటి వాటిని సాక్ష్యంగా చూపిస్తూ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు...
undefined
అయితే క్రికెట్‌పై ఇలాంటి ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు...
undefined
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఇప్పటికీ ఆరోపిస్తోంది శ్రీలంక మాజీ క్రికెటర్లు...
undefined
DC vs MI
undefined
click me!