Virat Kohli, RohitSharma
Virat Kohli - Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తికాగా, భారత్ ఒక మ్యాచ్ లో గెలిచింది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా అయింది. అయితే, ఈ సిరీస్ లో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మినహా ఇతర స్టార్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. దీంతో భారత టీమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా భారత సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అందరికీ టార్గెట్ గా మారారు.
Virat Kohli-Rohit Sharma
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలపై తీవ్ర విమర్శలు
మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 184 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత భారత జట్టు సీనియర్ ఆటగాళ్లపై వరుస విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్-రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఆసీస్ బౌలర్లకు ఎదురునిలబడి పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో వీరు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే చర్చ మొదలైంది.
Virat Kohli-Rohit Sharma
విరాట్-రోహిత్ లను జట్టు నుంచి బయటకు పంపుతారా?
భారత కెప్టెన్ రోహిత్ శర్మకు టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ ఇప్పటికే హాట్ టాపిక్ అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కూడా పెద్ద పరుగులు చేయడంలో విఫలం కావడంతో అతను కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భారత జట్టులోని కోహ్లి, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్ల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సెలెక్టర్లకు సూచించాడు. దీంతో క్రికెట్ సర్కిల్ లో కొత్త చర్చ మొదలైంది. మరి రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి బయటకు పంపుతారా? 2025లో రోహిత్, విరాట్ లు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
Virat Kohli-Rohit Sharma
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే?
2024 లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బ్యాట్ నుంచి టెస్టు క్రికెట్ లో పెద్దగా పరుగులు రాలేదు. ఏ సిరీస్ లోనూ పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. దీంతో వీరు టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ జట్టులో సినీయర్ ఆటగాళ్ల పాత్రపై సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా కోహ్లి గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. "బయట బంతుల్లో అతను పదే పదే అవుట్ కావడానికి అతని ఫుట్‌వర్క్ కారణమైంది. కోహ్లీ కాలు బంతి వైపు వెళ్లదు, అతని కాలు పిచ్‌పై నేరుగా ఉంటుంది. పాదం బంతి వైపు ఎక్కువగా కదులుతున్నట్లయితే, బంతిని కొట్టడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. కాళ్లు కదలడం లేదు కాబట్టి, మీరు బంతిని చేరుకోవడానికి ప్రయత్నించడం లేదని" అన్నారు.
Sunil Gavaskar, Virat Ball, Virat Kohli, Rohit Sharma,
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలపై సెలక్షన్ కమిటీ ఏం నిర్ణయం తీసుకోనుంది?
ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లతో జట్టును కొనసాగించే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, ఇతర సెలెక్టర్లు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గవాస్కర్ భావిస్తున్నాడు. ఎందుకంటే గత కొన్ని సిరీస్ లను గమనిస్తే జట్టులోని సీనియర్ ప్లేయర్ల నుంచి పెద్దగా ఆశించిన సహకారం లభించలేదని వివరించారు. "కోహ్లీ, రోహిత్ లను కొనసాగించడమనేది సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుంది. ఆశించిన సహకారం జరగలేదు. టాప్ ఆర్డర్ సహకారం అందించాలి. టాప్ ఆర్డర్ సహకరించకపోతే లోయర్ ఆర్డర్‌ను ఎందుకు నిందించాలి?" అని సునీల్ గవాస్కర్ అన్నారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు ఇలాంటి ప్రదర్శనకు సీనియర్ ఆటగాళ్ల వైఫల్యమే అతిపెద్ద కారణం అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
అంతకుముందు, రిషబ్ పంత్ పై కూడా సునీల్ గవాస్కర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సిరీస్ లో చెత్త షాట్స్ ఆడుతూ రిషబ్ పంత్ ఔట్ అవుతున్నాడని పేర్కొన్నాడు. అవసరంలేని షాట్స్ ఆడుతున్నాడనీ, స్టుపిడ్ అంటూ మండిపడ్డాడు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా షాట్స్ ఆడటం ఏంటని రిషబ్ పంత్ తీరుపై అగ్రహం వ్యక్తం చేశాడు.