బుమ్రాకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' దక్కుతుందా?

First Published | Dec 31, 2024, 10:24 PM IST

2024 ICC Player of the Year Award: 2024 సంవత్సరానికి గానూ ఉత్తమ క్రికెట్ ప్లేయర్ అవార్డుకి భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు. 

2024 ఐసీసీ ఉత్తమ ఆటగాళ్ళు ఎవరు?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్నాయి. అయితే,  మెల్‌బోర్న్‌లో భార‌త జ‌ట్టు ఓటమి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో (WTC) ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను నీరుగార్చింది. ఈ పరాజయం గంభీర్ కోచింగ్, రోహిత్ కెప్టెన్సీపై మచ్చగా మిగులుతుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. అలాగే, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌తో సహా చాలా మంది భార‌త స్టార్ ప్లేయ‌ర్లు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే, భార‌త జ‌ట్టులో ఒక ప్లేయ‌ర్ మాత్రం అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతున్నాడు. అత‌నే టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఓట‌మి బాధ నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం క‌ల్పించే గుడ్ న్యూస్ చెప్ప‌డానికి సిద్దంగా ఐసీసీ ఉంది. బుమ్రా ICC టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యాడు.

ప్రపంచ నం. 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఏడాది ఐసీసీ ఉత్తమ ఆటగాడి అవార్డుకి నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ దిగ్గంజ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు. 2024 బుమ్రాకి అద్భుతమైన సంవత్సరం.

2024లో జస్ప్రీత్ బుమ్రా 80 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, 10 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఐసీసీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డుకు ఎంపికైన హ్యారీ బ్రూక్ 1575 పరుగులు చేయడంతో పాటు 27 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ 1398 పరుగులు, 9 వికెట్లు, 11 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక జో రూట్ 1556 పరుగులు, 24 క్యాచ్‌లు, 11 వికెట్లు సాధించాడు. దీంతో ఈ అవార్డు కోసం పోటీ గట్టిగానే సాగుతోంది. 


జస్ప్రీత్ బుమ్రా

అంతేకాకుండా ,2024 ఉత్తమ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుకి కూడా భారత స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు. బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, శ్రీలంక కుసల్ మెండిస్ కూడా నామినేట్ అయ్యారు. 2024లో టెస్టు క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతను 13 మ్యాచ్‌లలో 14.92 సగటు, 30.16 స్ట్రైక్ రేట్‌తో 71 వికెట్లు తీశాడు.

అర్ష్‌దీప్ సింగ్

బుమ్రాతో పాటు భారత ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ 2024 ఉత్తమ టీ20 ఆటగాడి అవార్డుకి నామినేట్ అయ్యాడు. అలాగే, ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం, జింబాబ్వే ప్టార్ సికందర్ రజా కూడా నామినేట్ అయ్యారు. అంతేకాకుండా, 2024 ఐసీసీ ఉత్తమ వన్డే మహిళా క్రికెటర్ అవార్డుకు భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన నామినేట్ అయ్యింది. అలాగే, ఐసీసీ అవార్డుకు శ్రేయాంక పాటిల్ కూడా నామినేట్ అయ్యింది.

పురుషులు, మహిళల క్రికెట్ కలిపి మొత్తం 9 విభాగాల్లో ప్రతి విభాగంలో నలుగురు చొప్పున పురుష, మహిళా క్రికెటర్లు నామినేట్ అయ్యారు. అభిమానులు ఐసీసీ వెబ్‌సైట్‌కి వెళ్లి తమకు ఇష్టమైన ఆటగాళ్ళకు ఓట్లు వేయొచ్చు. ఈ ఓట్ల ఆధారంగా 11 రోజుల తర్వాత ఐసీసీ ఉత్తమ ఆటగాళ్ళను ప్రకటించి అవార్డులు ఇస్తుంది.

2024 ఉత్తమ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయినవారు: బుమ్రా, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, జో రూట్.

ఉత్తమ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ 2024 అవార్డుకి నామినేట్ అయినవారు: బుమ్రా, హ్యారీ బ్రూక్, కుశాల్ మెండిస్, జో రూట్.

ఉత్తమ వన్డే క్రికెట్ ప్లేయర్ 2024 అవార్డుకి నామినేట్ అయినవారు: వనిందు హసరంగ (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), అస్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్ఘనిస్తాన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్)

Latest Videos

click me!