Shreyas Iyer Big Promise To KKR Fans: ఐపీఎల్ లో ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ కు కొత్త కెప్టెన్ గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు అభిమానులకు భారీ హామీనిచ్చాడు. ఈసారి ఏదేమైనా కప్ కొట్టడం ఖాయమని...
కోల్కతా నైట్ రైడర్స్ కు ఇటీవలే కొత్త సారథిగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు అభిమానులకు బిగ్ ప్రామిస్ చేశాడు. ఈసారి ఛాంపియన్షిప్ (ఐపీఎల్) గెలవడమే తన లక్ష్యమని.. దానిని నెరవేరుస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు.
210
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి కొద్దిరోజులకు ముందు.. అయ్యర్ కోల్కతా అభిమానులతో ఆ జట్టు లక్ష్యాల గురించి వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోల్కతా.. తన యూట్యూబ్ ఛానెల్ లో పంచుకుంది.
310
ఈ సందర్బంగా అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈసారి నేను కోల్కతాకు సారథ్యం వహిస్తున్నాననే భావన ఎంతో ఉత్సాహంగా ఉంది. కోల్కతా అభిమానులందరిని కలవడానికి నేను ఎంతగానో వేచి చూస్తున్నా.. మీరంతా (అభిమానులు) మమ్మల్ని ఉత్సాహపరుస్తుండటం కోసం నేను వేచి చూస్తున్నా..
410
నేను ఆటగాళ్ల కెప్టెన్ గా ఉండాలనుకుంటున్నా. మనందరం ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపునకు ప్రయాణిస్తున్నాం. దానిని తప్పక అందుకుంటామని నాకు నమ్మకముంది. ఈసారి మనం (కేకేఆర్) ఛాంపియన్షిప్ ను గెలుచుకుంటామని నేను మీకు హామీ ఇస్తున్నాను..’అని అన్నాడు.
510
ఇంకా అయ్యర్ మాట్లాడుతూ... ‘కెప్టెన్సీ విషయంలో నాకు స్పష్టమైన ఆలోచన ఉంది. గతంతో పోలిస్తే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నాయకత్వ లక్షణాల విషయంలో నేను కొంత అనుభవం గడించాను.
610
కేకేఆర్ లో వివిధ దేశాల నుంచి విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ఆటగాళ్లున్నారు. వాళ్లందరితో కలిసి పనిచేసేందుకు నేను ఉత్సాహంగా వేచి చూస్తున్నాను.
710
వేలంలో కేకేఆర్ మొదట్నుంచి నాకోసం వెళ్లింది. ఇతర పెద్ద ఫ్రాంచైజీలు కూడా నాకోసం పోటీలోకి వచ్చినా వదలకుండా నన్ను దక్కించుకుంది. వేలం సందర్భంగా మేమంతా (టీమిండియా ఆటగాళ్లు) కలిసి టీవీల ముందు అతుక్కుపోయాం. నా పేరు వచ్చినప్పుడు నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. పైకి కామ్ గా ఉండటానికి ప్రయత్నించినా.. లోపల టెన్షన్ మాత్రం చాలా ఉంది..’ అని చెప్పాడు.
810
వేలంలో కేకేఆర్ మొదట్నుంచి నాకోసం వెళ్లింది. ఇతర పెద్ద ఫ్రాంచైజీలు కూడా నాకోసం పోటీలోకి వచ్చినా వదలకుండా నన్ను దక్కించుకుంది. వేలం సందర్భంగా మేమంతా (టీమిండియా ఆటగాళ్లు) కలిసి టీవీల ముందు అతుక్కుపోయాం. నా పేరు వచ్చినప్పుడు నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. పైకి కామ్ గా ఉండటానికి ప్రయత్నించినా.. లోపల టెన్షన్ మాత్రం చాలా ఉంది..’ అని చెప్పాడు.
910
కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తో పనిచేయడానికి తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అయ్యర్ చెప్పాడు. అతడు ఎంతో అగ్రెసివ్ గా ఉంటాడని.. న్యూజిలాండ్ తరఫునే గాక ఐపీఎల్ లో కూడా బ్రెండన్ దూకుడుగా ఆడటాన్ని ఎవరూ మరిచిపోలేదని అలాంటి వ్యక్తితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంతో ఉన్నానని అయ్యర్ అన్నాడు.
1010
గత సీజన్ లో సారథిగా ఉన్న ఇయాన్ మోర్గాన్ ను ఈసారి రిటైన్ చేసుకోని కేకేఆర్.. ఈనెల 12న జరిగిన వేలంలో అయ్యర్ ను దక్కించుకుంది. వేలంలో అయ్యర్ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇక ఫిబ్రవరి 16న, అతడిని తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది.