అసలేం జరుగుతుందో అర్థం కాక, చూస్తూ ఉండిపోయాం... ఏబీ డివిల్లియర్స్‌పై విరాట్ కోహ్లీ...

Published : Feb 28, 2022, 02:48 PM IST

ఐపీఎల్ ఎందరో క్రికెటర్లను ఆప్త మిత్రులుగా, మరికొందరిని బద్ధశత్రువుల్లా మార్చింది. ఐపీఎల్ ప్రపంచంలో ప్రాణస్నేహితులుగా మారారు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్. దాదాపు దశాబ్దం పాటు ఆర్‌సీబీకి ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఈసారి ఐపీఎల్‌ ఆడడం లేదు...

PREV
114
అసలేం జరుగుతుందో అర్థం కాక, చూస్తూ ఉండిపోయాం... ఏబీ డివిల్లియర్స్‌పై విరాట్ కోహ్లీ...

ఫ్రాంఛైజీ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, కోచింగ్ స్టాఫ్‌ సభ్యుడిగా ఆర్‌సీబీ భాగమవుతాడని ప్రచారం జరుగుతోంది...

214

కోహ్లీ అంతే తనకి ఎంత ఇష్టమో ఏబీ డివిల్లియర్స్, ఏబీడీ అంటే తనకు ఎంతటి అభిమానమో విరాట్... చాలాసార్లు చెప్పుకొచ్చారు... తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో ఏబీడీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు విరాట్ కోహ్లీ...
 

314

‘ఏబీ, తన చుట్టూ ఓ ఆహ్లదకర వాతావరణాన్ని నిర్మిస్తాడు. తానో ప్లేయర్‌లా అలా ఉండిపోకుండా జట్టులో ఈజీగా కలిసిపోతాడు...

414

అతనో అద్భుతమైన మనస్తత్వం కలవాడు, అద్భుతమైన టెక్నికల్ ప్లేయర్. గేమ్ గురించి ఏబీడీ తెలిసినంత ఎవ్వరికీ తెలీదని నా నమ్మకం...

514

కొన్ని సార్లు ఏబీడీ ఆటతీరును అంచనా వేయడం ఊహాలకు కూడా అందదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పుడు మేం అప్పుడప్పుడు మాత్రమే కలిసేవాళ్లం...

614

నేను దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకోగలిగాడు, కానీ ఏబీడీ కేవలం ఆరు నెలల పాటు ఖాళీగా ఉండి, నా కంటే ఐదు రెట్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు...

714

అది అతని సామర్థ్యానికి నిదర్శనం. ఏబీ, జీవితాన్ని చాలా సింపుల్‌గా చూస్తాడు. ప్రతీ మ్యాచ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాడు. నాకు అతనిలో బాగా నచ్చింది కూడా అదే...

814

క్రికెట్‌లో టీమిండియా కాకుండా బయటి ప్లేయర్లలో ఎవరిని చూసి స్ఫూర్తి పొందుతావని నన్ను అడిగితే, దానికి ఆన్సర్ ఏబీ డివిల్లియర్స్...

914

అతను తీసుకునే నిర్ణయాలు చాలా కచ్ఛితంగా ఉంటాయి. దాని ఫలితం ఎలా ఉన్నా, స్వీకరించడానికి విరాట్ సిద్ధంగా ఉంటాడు. అందుకే ఏబీలా ఉండాలని అందరికీ చెబుతూ ఉంటా...

1014

2015లో సౌతాఫ్రికా జట్టు, భారత పర్యటనకు వచ్చింది. వాంఖడేలో భారత్, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ జరుగుతోంది...

1114

ఆ మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్ 61 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ సాగుతున్నంతసేపు వాంఖడేలో ప్రేక్షకులు, ఏబీడీ... ఏబీడీ... అని అరుస్తున్నారు...మేం ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉన్నాం...
 

1214

మొదట వాళ్లు సౌతాఫ్రికా సపోర్టర్స్ అనుకున్నాం, కానీ వాళ్లంతా భారత క్రికెట్ ఫ్యాన్సే. కానీ ఏబీడీ ఆటను ఎంజాయ్ చేసి, తాము టీమిండియా సపోర్టర్స్ అనే విషయం కూడా మరిచిపోయారు...

1314

దాదాపు 50 వేల మంది భారత క్రికెట్ ఫ్యాన్స్, ‘ఏబీడీ...ఏబీడీ’ అని అరవడం చాలా స్పెషల్. అంత తేలిగ్గా అయ్యే పని కాదు. నాకు తెలిసి ఎవరికీ, ఎక్కడా ఇలా జరిగి ఉండకపోవచ్చు...

1414

ఏబీ డివిల్లియర్స్ మ్యాజిక్ అలా ఉంటుంది. ఎవ్వరైనా తనకు ఫ్యాన్స్‌గా మారిపోవాల్సిందే...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ సారథి, ఆర్‌సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ...
 

Read more Photos on
click me!

Recommended Stories