మ్యాచ్ కు ముందు ఇద్దరికి కరోనా.. పాంటింగ్ మాలో స్పూర్తి నింపాడు.. అందుకే చెలరేగి ఆడాం : ఢిల్లీ స్పిన్నర్

Published : Apr 21, 2022, 07:35 PM IST

TATA IPL 2022: ఐపీఎల్ లో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ -  పంజాబ్ కింగ్స్ నడుమ కరోనా నీడన ఆసక్తికర మ్యాచ్  జరిగిన విషయం తెలిసిందే. అయితే  ఈ మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిట్సల్స్  జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. 

PREV
18
మ్యాచ్ కు ముందు ఇద్దరికి కరోనా.. పాంటింగ్ మాలో స్పూర్తి నింపాడు.. అందుకే చెలరేగి ఆడాం : ఢిల్లీ స్పిన్నర్

మ్యాచ్ ప్రారంభానికే ముందే తమతో అప్పటిదాకా ఉన్న ఓ సభ్యుడు కరోనా బారిన పడితే ఎలాఉంటుంది..?  బుధవారం సరిగ్గా అదే పరిస్థితిలో  ఉంది ఢిల్లీ క్యాపిటల్స్.   పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు  సరిగ్గా  ఐదు గంటల ముందు ఈ విషయం తెలియడంతో ఆ జట్టు తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది. 

28

అసలు మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాల నడుమ కీలక మ్యాచ్ ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో  టాప్ లేపింది. పంజాబ్ ను తొలుత 115 పరుగులకే పడగొట్టి తర్వాత  పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

38

అయితే మ్యాచ్ కు ముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ చెప్పిన మాటలే తమలో  స్పూర్తిని రగిలించాయని దాని కారణంగానే  తాము బాగా ఆడగలిగామని  ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. 

48

పంజాబ్ తో మ్యాచ్ అనతరం అక్షర్ మాట్లాడుతూ... ‘మా జట్టులో కరోనా కారణంగా మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది.  తర్వాత ప్రాక్టీస్ చేసినా  మాలో ఏదో తెలియని ఆందోళన. ఇక ఈ మ్యాచ్ కు ముందే టిమ్ సీఫర్ట్ కూడా కరోనా భారీన పడ్డాడు. 

58

మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే మీమాంసలో ఉండగానే  మా కోచ్ రికీ పాంటింగ్ మా వద్దకు వచ్చి.. మనముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మనం ఈ మ్యాచ్ ఆడాలి. ఆడుతున్నాం.  మన జట్టులో పాజిటివ్ కేసులు ఉన్నాయి కదా అని మీరు  అనుకుంటుండొచ్చు. బయట ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకండి. 

68

మీ సామర్థ్యం మీద మీరు నమ్మకముంచండి.  మీ ప్రయత్నం మీరు చేయండి. మీ నిబద్దతను గ్రౌండ్ లో చూపించండి అని మాతో అన్నాడు. పాంటింగ్ ఇచ్చిన బలంతో మేము  బరిలోకి దిగాం..’ అని అక్షర్ అన్నాడు. 

78

అంతేగాక.. తాము బయిటి విషయాలను పట్టించుకోలేదని, కేవలం ఆటపైనే దృష్టి పెట్టామని అక్షర్ చెప్పాడు. ప్రణాళికబద్దంగా ఆడి  విజయం సాధించాలని పాంటింగ్ చెప్పాడని, అదే తమ మైండ్ సెట్ ను మార్చిందని అక్షర్ తెలిపాడు.  

88

పంజాబ్ తో మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది.  ఇక లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ల మెరుపు ఇన్నింగ్స్ తో పది ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. 

click me!

Recommended Stories