పూజారాని ద్వేషించడం మాకు చాలా ఇష్టం! అతన్ని అవుట్ చేసిన రోజు... జోష్ హజల్‌వుడ్ కామెంట్..

Published : Mar 29, 2023, 09:40 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది టీమిండియా. నాలుగు టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా, బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు...

PREV
17
పూజారాని ద్వేషించడం మాకు చాలా ఇష్టం! అతన్ని అవుట్ చేసిన రోజు... జోష్ హజల్‌వుడ్ కామెంట్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది టీమిండియా. నాలుగు టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా, బ్రిస్బేన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు...

27

‘టెస్టుల్లో ఛతేశ్వర్ పూజారాని అవుట్ చేయడం బౌలర్లకు చాలా పెద్ద థ్రిల్. అతన్ని అవుట్ చేయడమంటే చాలా విలువైనదాన్ని దక్కించుకోవడంతో సమానం. ఎందుకంటే అతను క్రీజులో అడ్డంగా నిలబడిపోతాడు...

37

ఒంటికి గాయమైనా సరే కానీ వికెట్ పారేసుకోవడానికి మాత్రం ఇష్టపడడు. ఛతేశ్వర్ పూజారా, నీ బౌలింగ్‌లో ఐదో బాల్‌కే అవుట్ కావచ్చు. అయితే అంతకుముందు మ్యాచ్‌‌లో పూజారాకి ఎన్నో ఓవర్లు వేసి ఉంటావో.. అప్పుడు దక్కని రిజల్ట్, ఈ మ్యాచ్‌లో దక్కింది..

47

ఛతేశ్వర్ పూజారాని ఎలా అవుట్ చేయాలా? అని టీమ్ మీటింగ్స్‌లో చాలా సార్లు చర్చించుకునేవాళ్లం. చాలాసార్లు పూజారా గురించి డిస్కర్షన్ వస్తే నేను మీటింగ్ నుంచి వెళ్లిపోయేవాడిని. ఎందుకంటే అలా జిడ్డులా క్రీజుకి అతుక్కుపోయే అతన్ని చూసి, చూసి నాకు విసుగు వచ్చేసింది..

57
Image credit: Getty

ఛతేశ్వర్ పూజారాని ద్వేషించడం, ఆస్ట్రేలియా బౌలర్లకు చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఓ అద్భుతమైన ప్లేయర్. టెస్టు క్రికెట్‌లో పూజారా లాంటి ప్లేయర్లు చాలా అరుదు. అందుకే అతన్ని ఎంత ఎక్కువగా ద్వేషిస్తే అంత త్వరగా అవుట్ చేయొచ్చు..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్...
 

67
Josh Hazlewood

2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా... టిక్కు... టిక్కుమంటూ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయి చూసేవారికే కాదు, బౌలింగ్ వేసేవారి ఓపికకి పరీక్ష పెట్టాడు పూజారా... ఒక్క సింగిల్ తీయడానికి 40-50 బంతులు వాడేశాడు పూజారా...
 

77
Cheteshwar Pujara

భారత బ్యాటింగ్ లైనప్‌కి వెన్నెముకగా నిలిచిన పూజారా, నాలుగు టెస్టుల్లో కలిపి 900లకు పైగా బంతులు ఎదుర్కొన్నాడు. తానొక్కడే నాలుగు టెస్టుల్లో కలిపి 154.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పూజారా, తన జిడ్డు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు విసుగు తెప్పించాడు..

click me!

Recommended Stories