విరాట్ కోహ్లీ, షారుక్ ఫ్యాన్స్ ‘పిల్ల నిబ్బా’ ఫ్యాన్ వార్... ట్విట్టర్‌లో పెరుగుతున్న పిల్ల చేష్టలు...

Published : Mar 28, 2023, 05:06 PM IST

క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కి కూడా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు రెండు భిన్నమైన రంగాలకు చెందినవాళ్లు. అయితే ఈ ఇద్దరి మధ్య పోలిక తీసుకొస్తూ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు కొందరు పిల్ల నిబ్బా ఫ్యాన్స్...  

PREV
17
విరాట్ కోహ్లీ, షారుక్ ఫ్యాన్స్ ‘పిల్ల నిబ్బా’ ఫ్యాన్ వార్... ట్విట్టర్‌లో పెరుగుతున్న పిల్ల చేష్టలు...

ఐపీఎల్‌లో కేకేఆర్‌ ఫ్రాంఛైజీకి యజమాని అయినా షారుక్ ఖాన్ ఎప్పుడూ క్రికెట్ ఆడింది లేదు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన విరాట్ కోహ్లీ, ఎప్పుడూ సినిమాల్లో నటించింది కూడా లేదు. అలాంటప్పుడు ఇద్దరి మధ్య పోలికలు తేలవడం, పొంతనలు చూడడం బుద్దిగా బుద్ది లేని పని...

27
Image credit: PTI

అయితే సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ చేస్తే కానీ పొద్దు పోనీ ఓ వర్గం, ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీని, షారుక్‌ని పోలుస్తూ నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొత్తేమీ కాదు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి ఆన్‌లైన్ కొట్లాట జరిగేది..
 

37

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌తో షారుక్ ఖాన్ ఫ్యాన్స్.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని గొడవపడేవాళ్లు. ఇప్పుడు సంబంధం లేకుండా ఓ బాలీవుడ్ హీరోని, ఓ భారత క్రికెటర్‌ని పోలుస్తూ కొట్టుకు చస్తుండడం, మిగిలిన జనాలకు చిరాకు తెప్పిస్తోంది...
 

47
shahrukh khan

అసలు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి, షారుక్ ఖాన్‌ ఫ్యాన్స్‌కి మధ్య ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటి? అంటే ఓ కేకేఆర్ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయాడని తిడుతూ వేసిన ఓ ట్వీట్. ఈ ట్వీట్‌పై స్పందించిన షారుక్ ఫ్యాన్స్, కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతూ ట్వీట్లు పెడుతుంటే, మరోవైపు విరాట్ ఫ్యాన్స్, షారుక్‌ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు...

57
Image credit: PTI

విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తిరుగులేని సూపర్ స్టార్. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. బీసీసీఐ కక్ష కట్టి కెప్టెన్సీ నుంచి తప్పించినా, మళ్లీ ఫామ్‌ని అందుకుని వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ కావడం దేశానికే గర్వకారణం...
 

67

అలాగే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ‘బాద్‌షా’గా ఎదిగాడు షారుక్ ఖాన్. వరుస పరాజయాలతో సతమతమైన షారుక్ ఈ ఏడాది ‘పఠాన్’తో బాక్సాఫీస్ ప్రభంజనం క్రియేట్ చేశాడు. సినిమాపై తీవ్రమైన ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్‌తో పాటు బాయ్‌కాట్ నినాదాలు వినిపించినా ‘నాన్-బాహుబలి’ రికార్డులన్నీ బ్రేక్ చేసింది షారుక్ సినిమా..

77

షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ నుంచి మంచి విషయాలు నేర్చుకుని, జీవితంలో ఎదిగి, సక్సెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాల్సింది పోయి... ఇలా పనికి రాని పిల్ల నిబ్బా ఫ్యాన్ వార్‌లతో సోషల్ మీడియాలో దేశం పరువు తీస్తున్నారు అభిమానులు. ఈ ఫ్యాన్ వార్‌లో పాల్గొంటున్న వారిలో చాలామంది ఉన్నత చదువులు చదివినవాళ్లు కూడా ఉండడం కొసమెరుపు..  

Read more Photos on
click me!

Recommended Stories