విరాట్ కోహ్లీని అప్పటి నుంచి చూస్తున్నా, పదేళ్లలో... హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్...

Published : Dec 25, 2021, 12:54 PM IST

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ తర్వాత భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20, టెస్టు సిరీస్ గెలిచినా... రాహుల్ ద్రావిడ్‌కి అసలైన పరీక్ష సౌతాఫ్రికా టూర్‌లో మొదలుకానుంది...

PREV
110
విరాట్ కోహ్లీని అప్పటి నుంచి చూస్తున్నా, పదేళ్లలో...  హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కామెంట్స్...

29 ఏళ్లుగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయింది భారత జట్టు. ఈ సారి టెస్టు సిరీస్ నెగ్గడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది టీమిండియా...

210

హెడ్‌కోచ్‌గా తొలి విదేశీ పర్యటన ఆరంభానికి ముందు ఇచ్చిన ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు రాహుల్ ద్రావిడ్...

310

2011లో విరాట్ కోహ్లీ టెస్టు ఆరంగ్రేటం చేసిన సమయంలో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్. మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

410

‘విరాట్ కోహ్లీ టెస్టు ఎంట్రీ చేసినప్పుడు నేను టీమ్‌లో ఉన్నాను, అతనితో కలిసి బ్యాటింగ్ చేశాను. ఈ పదేళ్లలో అతను ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా, లీడర్‌గా అద్భుతంగా ఎదిగాడు...

510

గత పదేళ్లలో అతను టెస్టుల్లో రాణించిన తీరు అసాధారణం. బ్యాటుతోనే కాకుండా లీడర్‌గానూ భారత జట్టును అద్వితీయ రీతిలో నడిపించాడు విరాట్ కోహ్లీ...

610

ఫిట్‌నెస్, ఎనర్జీ, లక్ష్యం దిశగా భారత జట్టు కల్చర్‌నే మార్చివేశాడు విరాట్. కోహ్లీ టీమ్‌ను నడిపించే విధానం, చూడడానికి చాలా అందంగా ఉంటుంది...

710

టీమిండియాలో నేను సభ్యుడిగా కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. విరాట్ కోహ్లీతో కలిసి జట్టును నడిపించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా...

810

అతను ఎప్పుడూ మరింతగా మెరుగ్గా మారడానికి కృషి చేస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ తనని మరింత మెరుగుపర్చుకోవాలని విరాట్ కోహ్లీ ఆరటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్...

910

2011లో వెస్టిండీస్‌తో జరిగిన  మ్యాచ్ ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన విరాట్, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

1010

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories