ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఏ ప్లేయర్‌కి కూడా ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్లే టీమ్‌లో చోటు దక్కలేదు. అయితే లక్కీగా ఆఖరి నిమిషంలో ఆ అవకాశం వాషింగ్టన్ సుందర్‌కి దక్కింది..
Image credit: Getty
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తూ గాయపడడంతో అతని ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌కి ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడాడు. సెప్టెంబర్ 16న బెంగళూరు నుంచి కొలంబో బయలుదేరి వెళ్లాడు వాషింగ్టన్ సుందర్..
సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక, ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయలేకపోయాడు. లంక ఇన్నింగ్స్ 15.2 ఓవర్లలోనే ముగియగా, 6.1 ఓవర్లలోనే టీమిండియా ఆ లక్ష్యాన్ని ఛేదించింది..
ఆసియా కప్ ఫైనల్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్, తిరిగి టీమ్‌తో కలిసి స్వదేశానికి వచ్చేశాడు. మొత్తానికి ఒక్క మ్యాచ్ ఆడకుండా, ఒక్క బంతి ఫేస్ చేయకుండా, ఒక్క బాల్ వేయకుండా, ఒక్క క్యాచ్ అందుకోకుండా ఆసియా కప్ 2023 విన్నింగ్ టీమ్ ప్లేయర్ అయ్యాడు వాషింగ్టన్ సుందర్..
జనవరి 2023లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా వాషింగ్టన్ సుందర్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. శ్రీలంకతో తొలి వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 390 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు.
Image credit: PTI
శుబ్‌మన్ గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 38, కెఎల్ రాహుల్ 7, సూర్యకుమార్ యాదవ్ 4, అక్షర్ పటేల్ 2 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా సుందర్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
Washington Sundar
శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్‌లో కూడా మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి, లంక పతనాన్ని శాసించాడు. షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. సుందర్‌కి బౌలింగ్ కూడా రాలేదు..
Washington Sundar
ఈ మ్యాచ్‌లో కూడా వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్‌లోనూ ఒక్క క్యాచ్ అందుకోలేదు. ఆ విధంగా భారత జట్టు పరుగుల తేడాతో (317 పరుగులు) అందుకున్న భారీ విజయంలో, బంతుల తేడాతో (263 బంతులు మిగిలి ఉండగానే) గెలిచిన గొప్ప విజయాల్లో సుందర్ భాగస్వామి అయ్యాడు..