2003, 2007 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, 2011 టోర్నీలో ప్రపంచ కప్ ఫైనల్ చేరలేకపోయింది. అయితే ఆ తర్వాత 2015లో మరోసారి వరల్డ్ కప్‌తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. రికీ పాంటింగ్, స్టీవ్ వా కెప్టెన్సీలో క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది ఆసీస్...
‘ఆస్ట్రేలియా తోపు టీమ్. 2000వ దశకంలో ఆస్ట్రేలియా ఏం చేసినా గెలిచేది. కొత్త ప్లేయర్లతో ఆడినా గెలిచేవాళ్లు, పాత ప్లేయర్లను తీసుకొచ్చి టీమ్‌లో పెట్టినా గెలిచేవాళ్లు. అసలు ఆస్ట్రేలియాని ఎలా ఓడించాలో మిగిలిన టీమ్స్‌కి అస్సలు అర్థమయ్యేది కాదు..
27
ఆస్ట్రేలియాకి ఎలా గెలవాలో బాగా తెలుసు. అందుకే ఎవరిని ఆడించాలనే విషయంలో ఆ టీమ్‌కి పూర్తి క్లారిటీ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ జట్లు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉన్నాయి. ఏ టీమ్‌నైనా ఓడించగల సత్తా ఉన్న జట్లే. అయితే ఆస్ట్రేలియా చూపించిన డామినేషన్ వేరే లెవెల్...
37
Ricky Ponting
ఆస్ట్రేలియా 50 పరుగుల లోపు 5 వికెట్లు కోల్పోయినా సరే, ఈజీగా 275-300 పరుగులు చేసేవాళ్లు. 8, 10 స్థానాల్లో వచ్చే బ్యాటర్లు కూడా ఈజీగా బౌండరీలు బాదేవాళ్లు. అలాంటి సౌలభ్యం టీమిండియాకి కానీ, పాకిస్తాన్‌కి కానీ లేదు.
47
అందుకే ఆస్ట్రేలియా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్‌కి డ్రీమ్ యూనిట్. ఇండియా, పాకిస్తాన్ అలా కాదు. ఈ రెండు జట్లు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి..
57
ధోనీ కెప్టెన్సీలో టీమిండియా బాగా ఆడింది. చాలా విజయాలు అందుకుంది. అయితే అప్పుడు కూడా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేస్తేనే విజయాలు దక్కేవి. ఎంత మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నా, బ్యాటింగ్ భారాన్ని మోసేందుకు కొందరిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి..
67
పాకిస్తాన్‌కి చాలా చక్కని బౌలింగ్ యూనిట్. కొన్ని తరాలుగా పాక్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంటోంది. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి ఒకరిద్దరిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.
77
ఇది మారనంత వరకూ ఇండియా, పాకిస్తాన్ టీమ్స్ ఎప్పటికీ ఆస్ట్రేలియాలా డామినేట్ చేయలేవు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్..