సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో రికార్డుల వర్షం కురిపిస్తున్న బ్యాటర్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న విరాట్, సచిన్ నూరు సెంచరీల రికార్డే టార్గెట్‌గా దూసుకుపోతున్నాడు...
2008 అండర్19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్‌గా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, 2010-2020 దశాబ్దంలో 20 వేలకు పైగా పరుగులు చేసి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు అందుకున్నాడు..
28
‘విరాట్ కోహ్లీలో టన్నుల్లో టాలెంట్ ఉంది. అది నాక్కూడా తలుసు. అయితే అతను ఇక్కడిదాకా వస్తాడని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. కోహ్లీ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని చాలామంది అనుకొని ఉండొచ్చు నేనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు...
38
sehwag kohli
లసిత్ మలింగ ఓవర్‌లో ఫోర్లు బాదినా, 40 ఓవర్లలో 280 పరుగులు కావాల్సిన సమయంలో ఓ అద్భుత సెంచరీతో టీమిండియాని ఆదుకున్నా.. విరాట్ కోహ్లీ 75 సెంచరీలు చేసేంత దూరం వస్తాడని అనిపించలేదు..
48
kohli sehwag
అతనిలో టాలెంట్ పుష్కలంగా ఉంది. అయితే ఆ టాలెంట్‌ని సరిగ్గా వాడుకోగల సత్తా ఉందా? అనేది నాకు అనుమానంగా అనిపించేది. అతని అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల కూడా ఇన్నేళ్లు క్రికెట్ ఆడతాడని అనుకోలేకపోయాను...
58
kohli sehwag
70-75 సెంచరీలు చేస్తాడని కానీ, 25 వేల అంతర్జాతీయ పరుగులు చేస్తాడని అస్సలు ఊహించలేదు. విరాట్ కోహ్లీ ఇంత ఎత్తుకు ఎదగడానికి అతని మెంటల్ స్ట్రెంగ్త్ ముఖ్య కారణం. నాతో పాటు తనని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికీ అతను తన పర్ఫామెన్స్‌తోనే సమాధానం చెప్పాడు...
68
ఈనాడు విరాట్ కోహ్లీని చూస్తుంటే, ఆనాడు నాతో ఆడిన కుర్రాడు ఇక్కడిదాకా వచ్చాడని నమ్మకం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అతను ఇప్పటికి చాలా నార్మల్‌గానే ఉంటాడు. నా పక్కనే బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తుండేవాడు.. పార్టీలకు బాగా వెళ్లేవాడు...
78
kohli sehwag
అతను ఈ స్థాయికి చేరడానికి కొత్తగా ఏమీ చేయలేదు. కానీ క్రమశిక్షణని బాగా అలవర్చుకున్నాడు. వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, పరుగులు చేయడం... ఈ మూడింటిపైనే ఫోకస్ పెట్టాడు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు...
88
Image credit: PTI
ఎంతోమంది ప్లేయర్లు కోహ్లీతో పాటే వచ్చారు, ఆడారు, వెళ్లిపోయారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సిమెంట్, ఇసుక, స్టీల్ అన్నీ తానే వేసుకుని తన భవంతిని అందంగా నిర్మించుకున్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్