ఆసియా కప్ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాదగా విరాట్ కోహ్లీ, పాకిస్తాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో అజేయ సెంచరీ బాదాడు..
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లను కేవలం వారి వయసును దృష్టిలో పెట్టుకుని, పక్కనబెట్టడం చాలా ప్రమాదకరం. క్రిస్ గేల్, ఎంత కాలం టీ20 క్రికెట్ ఆడాడో అందరికీ తెలుసు. 41 ఏళ్ల వయసులో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు..
Rohit virat
వరల్డ్‌లో చాలా మంది బెస్ట్ ప్లేయర్లు, సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడారు. ముఖ్యంగా టీ20ల్లో అద్భుతంగా రాణించారు. ఫిట్‌గా ఉన్నంత కాలం ఆడించాలి... వయసు కారణంగా ఏ ప్లేయర్‌ని పక్కనబెట్టకూడదనేది నా సిద్ధాంతం..
James Anderson
జేమ్స్ అండర్సన్ 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా టెస్టుల్లో అదరగొడుతున్నాడు. అతని వయసు పెరిగిందని మేం పక్కనబెట్టలేదు. ఎందుకంటే అతనిలో ఎంత సత్తా ఉందో మాకు బాగా తెలుసు..
అనుభవాన్ని, స్కిల్స్‌ని వాడుకోవడం, టీమ్‌కే మంచిది. వయసు చూసి చాలామంది ప్లేయర్లు, కెరీర్ ముగింపు దశలో ఉన్నట్టుగా చూస్తారు. ముందు దాన్ని మానుకోవాలి. మంచి ప్రదర్శన ఇచ్చినంత కాలం కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది. వయసుతో సంబంధం లేదు..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నారు. వారి ప్లేస్‌ని రిప్లేస్ చేయగల ప్లేయర్‌ను పట్టుకురావడం చాలా కష్టం. ఎన్నో ఏళ్లు టీమ్‌ని తమ భుజాలపై మోస్తున్నారు..
Joe Root
భారత క్రికెట్ జట్టు తరుపున ఇన్నేళ్ల పాటు ఆడడం అంటే చిన్న విషయం కాదు. చాలా తక్కువ మందికి మాత్రం ఈ అవకాశం దక్కింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఆటతీరును మెరుగుపర్చుకోగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది..
Kohli-Rohit
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారు. వారి వయసైపోయిందని, ఇక టీ20లు ఆడలేరని రాయడం కరెక్ట్ కాదు... వాళ్లు టీ20లు ఆడాలనుకుంటే, ఆపే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు ప్లేయర్ జో రూట్..