టాప్ ర్యాంకుకి చేరువైన విరాట్ కోహ్లీ... అయితే ప్రమాదంలో కింగ్ కోహ్లీ టాప్ 5...

First Published Dec 20, 2020, 7:14 PM IST

మొదటి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు విరాట్ కోహ్లీ. 180 బంతుల్లో 74 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకుకి మరింత చేరువయ్యాడు. టెస్టుల్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, మొదటి టెస్టులో విఫలం కావడం కూడా కోహ్లీకి కలిసి వచ్చింది.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 888 పాయింట్లు ఉండగా, టాప్ ప్లేస్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌కి 901 పాయింట్లు ఉన్నాయి...
undefined
అయితే మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి పయనమైన విరాట్ కోహ్లీ, టెస్టులతో పాటు ఐసీసీ ర్యాంకును కూడా కోల్పోబోతున్నాడు...
undefined
మూడు టెస్టు మ్యాచులు ఆడకపోవడం వల్ల విరాట్ కోహ్లీ 27 పాయింట్లు కోల్పోతాడు... అంటే టెస్టు సిరీస్ ముగిసేసరికి కోహ్లీ ఖాతాలో 861 పాయింట్లు మాత్రమే ఉంటాయి...
undefined
మిగిలిన మూడు టెస్టులు ఆడబోతున్న స్టీవ్ స్మిత్... తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకోవడానికి ఇది అద్భుత అవకాశం.
undefined
ఇదే సమయంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతున్నాడు.
undefined
ఈ సిరీస్‌లో కేన్ విలియంసన్ ఒక్క సెంచరీతో రాణించినా... అతను రెండో ర్యాంకుకి ఎగబాకుతాడు. కోహ్లీకి, కేన్ విలియంసన్‌కి ఉన్న పాయింట్ల తేడా కేవలం 11.
undefined
అలాగే ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న మార్కస్ లబుషేన్ కూడా తన ర్యాంకుని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది...
undefined
మొదటి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో రాణించిన లబుషేన్... ప్రస్తుతం 839 పాయింట్లతో ఉన్నాడు. అతని నుంచి రెండు మంచి ఇన్నింగ్స్‌లో వస్తే పైకి ఎగబాకుతాడు.
undefined
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 797 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే గాయంతో టీ20 సిరీస్‌కు దూరమైన ఆజమ్, న్యూజిలాండ్‌తో మొదటి టెస్టుకి అందుబాటులో ఉండడం కష్టమే. కాబట్టి అతనితో పెద్ద రిస్క్ లేదు.
undefined
ఎలా చూసుకున్నా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసేసరికి భారత కెప్టెన్ టాప్ 4కి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
click me!