Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మహేళ జయవర్థనే (1016 పరుగులు) రికార్డును అధిగమించేసిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 4 ఇన్నింగ్స్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు బాదాడు...
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 3 అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేయడం విరాట్ కోహ్లీకి ఇది మూడోసారి. ఇంతకుముందు 2007లో మాథ్యూ హేడెన్, గౌతమ్ గంభీర్, 2009 టీ20 వరల్డ్ కప్‌లో తిలకరత్నే దిల్షాన్, 2010లో మహేళ జయవర్థనే... మూడు, అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు బాదాడు.
Virat Kohli
2012లో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, శామ్యూల్స్, 2014లో మోబర్గ్, 2021లో నిశ్శంక, డేవిడ్ వార్నర్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, కెఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించారు. మొత్తంగా 13 మంది ప్లేయర్లు ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో 3+ హాఫ్ సెంచరీలు బాదాడు...
Image credit: Getty
అయితే విరాట్ కోహ్లీ ఒక్కడే మూడు ఎడిషన్లలో 3+ హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా ఉన్నాడు. 2014, 2016 టీ20 వరల్డ్ కప్ సీజన్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ నెగ్గిన విరాట్ కోహ్లీ, ఆ ఎడిషన్లలో 3+ హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2022లో మూడోసారి ఈ ఫీట్ సాధించాడు...
kohli
మిగిలిన ప్లేయర్లు అందరూ రెండోసారి చేయలేకపోతుంటే విరాట్ కోహ్లీ ఏకంగా మూడు టోర్నీల్లో ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌పై చేసిన హాఫ్ సెంచరీ, విరాట్‌కి అంతర్జాతీయ కెరీర్‌లో 199వ 50 + స్కోరు...
సచిన్ టెండూల్కర్ 264, రికీ పాంటింగ్ 217, కుమార సంగర్కర 216, జాక్వస్ కలీస్ 211 సార్లు 50+ స్కోర్లు సాధించి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో 23 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ, 13 హాఫ్ సెంచరీలు నమోదు చేయడం మరో విశేషం...
టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 9 సార్లు 50+ స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టూ టైమ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ప్లేయర్లు అందరూ కలిసి పొట్టి ప్రపంచకప్‌లో 9 సార్లు ఈ ఫీట్ సాధిస్తే, ఇంగ్లాండ్ ప్లేయర్లు 8 సార్లు, బంగ్లాదేశ్ ప్లేయర్లు 5 సార్లు, న్యూజిలాండ్ ప్లేయర్లు 3 సార్లు ఈ ఫీట్ సాధించారు.
Virat Kohli
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉంటే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు... ఈ వరల్డ్ కప్‌లో 4 ఇన్నింగ్స్‌లో 220 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు.