వీరూ వల్ల సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... భారత్ తరుపున తొమ్మిదో ప్లేయర్‌గా...

First Published | Nov 29, 2020, 11:41 AM IST

విరాట్ కోహ్లీ... గత దశాబ్దకాలంలో రికార్డుల పుస్తకాలను క్రియేట్ చేసిన రన్ మెషిన్. సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన అనితరసాధ్యమైన రికార్డులను కొల్లగొట్టగలిగే ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు దక్కించుకున్న విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా సిరీస్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్‌తో రెండో వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.

Virat Kohli creates another milestone record against Australia, Ninth Indian player to do CRA
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో 66 పరుగుల తేడాతో చిత్తైన టీమిండియా, రెండో వన్డేలో ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా కంట్రోల్ చేసేందుకు కష్టపడుతోంది.
Virat Kohli creates another milestone record against Australia, Ninth Indian player to do CRA
మొదటి వన్డేలో టాస్ ఓడిపోయిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలోనూ టాస్ గెలవలేకపోయాడు. మొదటి వన్డేలో టాస్ ఓడి రెండోసారి బ్యాటింగ్ చేసిన టీమిండియా, రెండో వన్డేలోనూ చేధన చేయనుంది.

2018 జనవరి నుంచి జరిగిన 48 మ్యాచుల్లో 28 సార్లు టాస్ ఓడిపోయాడు విరాట్ కోహ్లీ. వన్డే క్రికెట్‌లో ఇదో చెత్త రికార్డు. ఈ టైమ్‌లో మరే కెప్టెన్ ఇన్నిసార్లు టాస్ ఓడిపోలేదు.
విరాట్ కోహ్లీ కెరీర్‌లో నేటి మ్యాచ్‌ అతనికి 250వ వన్డే. 249 వన్డేల్లో 11,888 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మరో 112 పరుగులు చేస్తే 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
టీమిండియా తరుపున 250 వన్డేలు ఆడిన తొమ్మిదో ప్లేయర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు 8 మంది భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
250 వన్డేల్లో 43 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 58 హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు. ఇంతకుముందు 60+ సగటుతో వన్డేల్లో పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది పేలవ ప్రదర్శన కారణంగా యావరేజ్ పడిపోయింది.
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ భారత జట్టు తరుపున 463 వన్డేలు ఆడి, అత్యధిక మ్యాచులు ఆడిన భారత ప్లేయర్‌గా, ప్రపంచంలోనే అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు.
ఆ తర్వాతి స్థానంలో ఉన్న అనిల్ కుంబ్లే 269 వన్డే మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 334 వికెట్లు పడగొట్టాడు...
మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ కూడా 250+ వన్డే మ్యాచులు ఆడారు...
కెరీర్ చివరాంకంలో భారత జట్టులో చోటు కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా తరుపున 241 వన్డేలు ఆడారు. అయితే ఆసియా ఎలెవన్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్ తరుపున 10 మ్యాచులు ఆడారు.
తన 250వ మ్యాచ్‌లో అయినా విరాట్ కోహ్లీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు అతని అభిమానులు. ఛేజింగ్ కింగ్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ రాణిస్తే టీమిండియా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

Latest Videos

click me!