మిగిలిన మ్యాచులకు వచ్చేందుకు ముంబై స్టార్ బౌలర్ సిద్ధం... ఐపీఎల్ 2021కి ప్లేయర్లను పంపలేమంటున్న బంగ్లాదేశ్...

First Published Jun 1, 2021, 4:33 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నా, ఈసారి ఫారిన్ స్టార్లు లేకుండానే పార్ట్ 2 మ్యాచులు జరిగేలా కనిపిస్తున్నాయి. ఆఖరికి బంగ్లా బోర్డు కూడా ప్లేయర్లను పంపలేమంటూ చేతులు ఎత్తేసింది.

ఇప్పటికే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు, ఆ సమయంలో ఉన్న సిరీస్‌ల కారణంగా ఆటగాళ్లను ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంపలేమని స్పష్టం చేశాయి.
undefined
ఈ నిర్ణయం వల్ల మోర్గాన్, జానీ బెయిర్ స్టో, సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ, కేన్ విలియంసన్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు.
undefined
మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ప్లేయర్లను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ ముందు ఐపీఎల్ మ్యాచులు ప్రాక్టీస్‌గా ఉపయోగపడతాయని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించినా, ఐపీఎల్ 2021 సీజన్‌లో కలిగిన అనుభవాల కారణంగా ఆసీస్ ప్లేయర్లు భయపడుతున్నారట.
undefined
తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా తమ ప్లేయర్లను ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంపలేమని ప్రకటించింది. బంగ్లా నుంచి షకీబుల్ హసన్, కేకేఆర్ జట్టులో... ముస్తాఫిజుర్ రెహ్మాన్ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నారు. ఈ ఇద్దరికీ ఎన్‌ఓసీ ఇవ్వలేమని బంగ్లా బోర్డు ప్రకటించింది.
undefined
‘ఐపీఎల్‌లో పాల్గొనడానికి షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్‌కి ఎన్‌వోసీ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే ఆ సమయంలో బంగ్లాకి వేరే మ్యాచులు ఉంటాయి. అదీకాకుండా టీ20 వరల్డ్‌కప్ కూడా సమీపిస్తుంది. ఆ మెగా టోర్నీకి గాయపడకుండా అందుబాటులో ఉండడం అవసరం’ అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నజ్‌ముల్ హసన్ తెలిపాడు.
undefined
న్యూజిలాండ్ ప్లేయర్లను ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంపడానికి కివీస్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేకపోయినా, తాను ముంబై తరుపున మిగిలిన మ్యాచులు ఆడాలని అనుకుంటున్నట్టు స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు.
undefined
‘ఐపీఎల్‌, యూఏఈకి వెళ్తుందని విన్నా. గత ఏడాది అక్కడ మ్యాచులు బాగా జరిగాయి. నాకు అవకాశం వస్తే, ముంబై ఇండియన్స్ తరుపున నా క్యాంపెయిన్ ముగించాలని అనుకుంటున్నా...’ అంటూ ప్రకటించాడు ట్రెంట్ బౌల్ట్.
undefined
click me!