టాప్‌లోకి టీమిండియా... ధోనీ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ...

First Published Feb 25, 2021, 8:25 PM IST

తొలి టెస్టు ఓడిన తర్వాత అద్బుతమైన ఆటతీరుతో కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా, వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి తిరిగి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. స్వదేశంలో 22వ టెస్టు విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ, ధోనీ పేరిట ఉన్న 21 టెస్టుల విజయాన్ని అధిగమించాడు...

పింక్ బాల్ టెస్టు విజయంతో 71 శాతం విన్నింగ్ పర్సంటేజ్‌తో టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌లో రెండో స్థానంలో ఉండగా, 69.2 శాతం విజయాలతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.
undefined
పింక్ బాల్ టెస్టులో ఓడిన ఇంగ్లాండ్, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఆఖరి టెస్టులో గెలిచినా ఇంగ్లాండ్‌కి ఐసీసీ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆడే అవకాశం దక్కదు. ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే, ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...
undefined
ఆఖరి టెస్టు డ్రా చేసుకున్నా సరే... టీమిండియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది..
undefined
స్వదేశంలో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, కోహ్లీ 29 మ్యాచుల్లో 22 విజయాలు అందుకున్నాడు...
undefined
స్వదేశంలో అత్యధిక విజయాలు అందుకున్న మూడో కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 30 విజయాలు, రికీ పాంటింగ్ 29 విజయాలతో టాప్ 2లో ఉన్నారు. స్టీవ్ వాగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ 22 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.
undefined
ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. సచిన్ 9 జట్లపై, గంగూలీ, ద్రావిడ్ 8 జట్లపై ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, సెహ్వాగ్, అజారుద్దీన్‌ ఏడేసి జట్లపై ఈ ఫీట్ సాధించారు...
undefined
గత 75 ఏళ్లల్లో అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టు మ్యాచ్ ఇదే. 1945లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు 872 బంతుల్లో ముగియగా, ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు 842 బంతుల్లోనే ముగిసింది...
undefined
click me!