Published : Oct 08, 2022, 07:09 PM ISTUpdated : Oct 08, 2022, 07:10 PM IST
హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలో భారత జట్టు ద్వైపాక్షిక సిరీసుల్లో సంచలన ప్రదర్శనలు ఇచ్చింది. ఐసీసీ టైటిల్ గెలవలేదన్న ఒక్క లోటు తప్ప ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో చూపించిన ప్రదర్శన నఃభూతో! అనాల్సిందే. ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు లేకుండా బీ టీమ్‌తో గబ్బాలో ఆస్ట్రేలియా కంచుకోటను కూల్చింది టీమిండియా. మరి ఇప్పుడు భారత జట్టుకి ఏమైంది...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో టీమిండియా, టైటిల్ ఫెవరెట్ జాబితా నుంచి తప్పుకున్నట్టైంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చినా అతను బాల్‌తో మ్యాజిక్ చేయగలడు కానీ బ్యాటుతో జడ్డూని రిప్లేస్ చేయలేడు..
210
Image credit: PTI
జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీకి దూరమైనా అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనే విషయాన్ని డిసైడ్ చేయడానికి చాలా సమయమే తీసుకుంటోంది బీసీసీఐ. దీపక్ చాహార్‌ని ఆడించాలని అనుకున్నా, అతను కూడా గాయంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు...
310
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడించాల్సిన పరిస్థితి టీమిండియాది. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ అనుసరించిన ప్రయోగ వ్యూహమే...
410
రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాంలో ఐపీఎల్‌లో ఆడిన ప్లేయర్లకు టీమిండియాలో చోటు దక్కేది. బాగా ఆడితే వాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చేవాళ్లు. ఇప్పుడు టీమిండియాకి కీలక సభ్యుడిగా మారిపోయిన సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇషాన్ కిషన్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, వెంకటేశ్ అయ్యర్... ఇలా టీమిండియాలోకి వచ్చినవాళ్లే...
510
అయితే రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఈ ఫార్ములాని పెద్దగా పట్టించుకోవడం లేదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఓ 15 మందిని ఆడించాలని చాలా ముందుగానే డిసైడ్ అయ్యారు ఈ ఇద్దరూ. వాళ్లకి మాత్రమే ఎక్కువ మ్యాచుల్లో అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు...
610
Image credit: Getty
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠిలకు ఇవ్వాల్సినన్ని అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. కారణం వీళ్లద్దరూ బాగా ఆడితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి అనుకున్న జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుందని రాహుల్ ద్రావిడ్ అండ్ కో భావించి ఉండవచ్చు...
710
అయితే ఈ వ్యూహం కరెక్టుగా పారలేదు. ఆవేశ్ ఖాన్ అనుకున్నంతగా రాణించలేకపోవడం, అనుకోకుండా జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతని ప్లేస్‌లో ఎవరిని ఆడించాలనే విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కి సందిగ్ధత నెలకొంది...
810
ప్రసిద్ధ్ కృష్ణ గాయంతో సతమతమవుతుంటే ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడనే కారణంగా శార్దూల్ ఠాకూర్‌ని టీ20లకు దూరం పెట్టేశారు. కోహ్లీ కెప్టెన్సీలో చెలరేగిపోయిన మహ్మద్ సిరాజ్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో పేలవ ప్రదర్శన ఇస్తున్నాడు...
910
Jasprit Bumrah, Ishant Sharma, Mohammed Shami, Bhuvneshwar Kumar, Umesh Yadav
రవిశాస్త్రి పేస్ అస్త్రంగా తయారుచేసిన నవ్‌దీప్ సైనీని రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఇప్పటిదాకా సరిగ్గా వాడే ప్రయత్నం కూడా చేయలేదు. భీమర్లతో వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపించే సైనీని పక్కనబెట్టడానికి కారణం ఏంటో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు...
1010
Image credit: Getty
ఒకప్పుడు బుమ్రా, భువీ, శార్దూల్, షమీ, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, నట్టూ, సైనీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్... ఇలా వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లతో నిండిన భారత పేస్ బౌలింగ్ విభాగం ఇప్పుడు ఒక్క సరైన రిప్లేస్‌మెంట్ ప్లేయర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో పడిపోవడం టీమిండియా ఫ్యాన్స్‌కి మింగుడు పడడం లేదు..