ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. 74 మ్యాచులు, రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఊర్రూతలూగించిన మెగా క్రికెట్ సమరం ముగియడంతో క్రికెట్ ఫ్యాన్స్‌ని తెగ బోర్ కొడుతోంది. అయితే ఇది కొన్నాళ్లే. ఎందుకంటే ఐపీఎల్ ముగిసినా ఇకపై బ్రేకుల్లేకుండా వరుస సిరీసులో ఆడబోతోంది భారత జట్టు...
ఐపీఎల్ ముగిసిన తర్వాత కేవలం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకునే భారత ప్లేయర్లు, జూన్ 5 నుంచి మళ్లీ బీసీసీఐ క్యాంపులో చేరబోతున్నారు. జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కి సిద్ధం కానుంది భారత జట్టు...
27
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరి వెళ్లే భారత జట్టు, అక్కడ కౌంటీ టీమ్‌తో కలిసి జూన్ 24 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1న డర్బీషైర్ టీమ్‌తో ఓ టీ20 వార్మప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...
37
అదే రోజు మరో జట్టు ఇంగ్లాండ్‌తో కలిసి ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. జూలై 5న ఈ టెస్టు మ్యాచ్ ముగియనుంది. అయితే ఈ లోపు మరో జట్టు నార్తమ్‌టన్‌సేర్‌తో మరో టీ20 మ్యాచ్ ఆడుతుంది...
47
ఆ తర్వాత జూలై 7 నుంచి మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లు ఆడుతుంది భారత జట్టు. జూలై 17న ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని ఐర్లాండ్‌కి వెళ్తుంది. అక్కడ జూలై 26న, 28న రెండు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది...
57
ఇంగ్లాండ్ టూర్ ముగియగానే అక్కడి నుంచి వెస్టిండీస్ టూర్‌కి వెళ్తుంది భారత జట్టు. ఈ టూర్‌లో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత శ్రీలంక టూర్‌కి వెళ్లి 2 టీ20 మ్యాచులు ఆడనుంది...
67
ఆగస్టు నెలాఖరును ఆసియా కప్ టీ20 టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో కలిసి మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది..
77
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు దాదాపు 25 నుంచి 30 వరకూ టీ20 మ్యాచులు ఆడబోతోంది భారత జట్టు. అయితే టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది బీసీసీఐ...