వెస్టిండీస్‌పైనే 5 వికెట్లు పోయాయంటే, ఆస్ట్రేలియాతో అయితే అస్సామే! ఈ టీమ్‌తో వరల్డ్ కప్ గెలవగలమా?

Published : Jul 28, 2023, 01:02 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. గత పదేళ్లుగా ఎన్ని ఐసీసీ టోర్నీల్లో షాకులు ఎదురైనా, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ కావడంతో ఈసారి మనోళ్లు కప్పు కొడతారని గట్టిగా నమ్ముతున్నారు భారత క్రికెట్ జట్టు అభిమానులు...  

PREV
16
వెస్టిండీస్‌పైనే 5 వికెట్లు పోయాయంటే, ఆస్ట్రేలియాతో అయితే అస్సామే! ఈ టీమ్‌తో వరల్డ్ కప్ గెలవగలమా?

ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది టీమిండియా. అయితే వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది..

26

టాస్ గెలిచిన రోహిత్ శర్మ, బ్యాటింగ్ ఎంచుకుని... ఓ 250+ స్కోరు చేసినా పెద్దగా విమర్శలు వచ్చి ఉండేవి కావు. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో చిత్తుగా ఆడిన వెస్టిండీస్ ఆటతీరు చూసిన తర్వాత కూడా రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
 

36

నెమ్మదిగా ఆడుతూ పాడుతూ ఈ లక్ష్యాన్ని 25 ఓవర్లలో ఛేదించినా పెద్దగా ట్రోలింగ్ వచ్చేది కాదు. కొట్టాల్సిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఎలాగోలా గెలిచి ఊపిరి పీల్చుకుంది..

46

వెస్టిండీస్‌పైనే ఇలా ఆడిన టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్‌ని ఎలా ఎదుర్కొంటుందనేది టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడుతున్న విషయం.. వెస్టిండీస్‌పైనే 5 వికెట్లు పోయాయంటే, ఆస్ట్రేలియాతో అయితే మన కథ అస్సామే! అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..

56

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది టీమిండియా. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వీళ్లంతా మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు..

66

వెస్టిండీస్‌తో 115 పరుగుల లక్ష్యం ఛేదించడానికి చచ్చీ చెడి గెలిచిన జట్టు, వన్డే వరల్డ్ కప్‌ని గెలవగలదా? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్స్‌ని ధీటుగా ఎదుర్కోగలదా? ఇప్పుడు టీమిండియా అభిమానులను కలవరబెడుతున్న విషయం ఇదే..
 

Read more Photos on
click me!

Recommended Stories