స్పినర్లకు అన్యాయం జరుగుతోంది.... మాకు మాత్రమే ఎందుకు ఇలా? పిచ్ విమర్శకులకు ప్రజ్ఞాన్ ఓజా కౌంటర్...

First Published Feb 26, 2021, 5:41 PM IST

మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 578 పరుగుల భారీ స్కోరు చేసింది. జో రూట్ డబుల్ సెంచరీ, సిబ్లీ, బెన్ స్టోక్స్ 80+ స్కోర్లతో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అందరూ ఎంతో కొంత రాణించారు. అయితే ఐదురోజుల పాటు సాగిన ఆ మ్యాచ్ అప్పుడు పిచ్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి...

స్పిన్‌కి అనుకూలించే పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌట్ అయింది ఇంగ్లాండ్. భారత జట్టు కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయింది...
undefined
మొతేరా పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. రోహిత్ శర్మ చేసిన 66 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. విరాట్ కోహ్లీ, పూజారాతో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు...
undefined
భారత్, ఇంగ్లాండ్ స్పిన్నర్ల మధ్య పోటీలా జరిగిన ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టుకే విజయం దక్కింది. దీంతో పిచ్‌పై విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా...
undefined
‘క్రికెట్ పిచ్ అంటే బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ఇద్దరికీ సహకరించేలా ఉండాలని మీరే అంటారు. అయితే ఎవరైనా బ్యాట్స్‌మెన్ 400 లేదా 300 కొడితే పిచ్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇది పోటీపడే వికెట్...
undefined
ఇక్కడ రాణించాలంటే బ్యాట్స్‌మెన్ బాగా ఆడాలి... జాగ్రత్తగా ఆడాలి. అంతే కానీ స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు కాబట్టి పిచ్ బాగోలేదని కామెంట్ చేయడం కరెక్టు కాదు...
undefined
ఏ బ్యాట్స్‌మెన్ అయినా భారీ స్కోరు సాధిస్తే అతన్ని మెచ్చుకుంటారు... పేసర్ అద్భుతంగా స్పింగ్ చేసి వికెట్లు తీస్తే ‘భళా’ అంటారు. స్పిన్నర్లు రాణించినప్పుడు మాత్రమే పిచ్ నాసిరకమైనదని ఎందుకు విమర్శలు చేస్తారు...
undefined
బ్యాట్స్‌మెన్‌కి, పేసర్లకు సహకరిస్తే పిచ్ నాణ్యమైనది, స్పిన్నర్లకు సహకరిస్తే మాత్రం నాసిరకమైనది ఎలా అవుతుంది... ఇది కరెక్టు కాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు ప్రజ్ఞాన్ ఓజా...
undefined
పింక్ బాల్ టెస్టులో స్పిన్నర్లు 28 వికెట్లు పడగొట్టడం విశేషం. జో రూట్ కెరీర్‌లో మొదటిసారిగా 5 వికెట్లు తీయగా, జాక్ లీచ్‌కి నాలుగు వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 7 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్‌కి ఓ వికెట్ దక్కింది.
undefined
24 టెస్టుల్లో 113 వికెట్లు తీసిన ప్రజ్ఞాన్ ఓజా... 89 పరుగులు మాత్రమే చేశాడు. చేసిన పరుగుల కంటే, ఎక్కువ వికెట్లు తీసిన అరుదైన బౌలర్లలో ఒకడిగా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా... మొత్తంగా 18 వన్డేలు, 6 టీ20లతో పాటు 48 మ్యాచులు ఆడి 144 వికెట్లు పడగొట్టాడు.
undefined
click me!