ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్లుగా ప్రారంభించిన జట్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేని ఓడించిన కేకేఆర్, ఆ తర్వాత ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది...
ఆర్‌సీబీతో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో ఓడిపోయినప్పటికీ, ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్‌ని తీసుకెళ్లి... బెంగళూరు శిబిరంలో గుబులు రేపింది కేకేఆర్...
29
మూడింట్లో రెండు మ్యాచులు గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, టాప్‌లో ఉంది...
39
గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన కేకేఆర్, మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది... అయ్యర్ అంచనాలకు తగ్గట్టుగా జట్టును నడిపిస్తున్నాడు..
49
‘శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అతను 2018లోనే కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు. కుర్రాడు, చాలా నేర్చుకోవాల్సిన వాడు...
59
అయినా అద్బుతంగా జట్టును నడిపిస్తున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్ చూసినా, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ చూసినా... శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు....
69
రాజపక్ష 9 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఈజీగా 180+ స్కోరు చేస్తుందని అనుకున్నా. కానీ ఉమేశ్ యాదవ్‌ని చక్కగా వాడుకున్న అయ్యర్, అద్భుతమైన రిజల్ట్ రాబట్టాడు...
79
బ్యాటర్లను సెటిల్ అవ్వకుండా వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్‌లను తీసుకొచ్చి రిజల్ట్ రాబట్టాడు. పంజాబ్ కింగ్స్ కంటే ఎక్కువగా మ్యాచ్‌పై పట్టు సాధించాలనే కసి అయ్యర్‌లో కనిపించింది...
89
9వ ఓవర్‌లో ఉమేశ్ యాదవ్‌ని తీసుకొచ్చిన అయ్యర్, డేంజర్ లివింగ్‌స్టోన్ వికెట్ సాధించాడు. ఆ తర్వాత బ్యాటర్లను బట్టి వారి వీక్‌నెస్‌కు తగ్గ బౌలర్‌ను వాడాడు...
99
శ్రేయాస్ అయ్యర్ లాంటి కెప్టెన్ ఉండడంతో కేకేఆర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. నా ఉద్దేశంలో కేకేఆర్ కచ్ఛితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. అయ్యర్ చాలా స్మార్ట్ కెప్టెన్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...