విరాట్ కోహ్లీపై ట్రోల్, లైక్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్... అంబటి రాయుడి గతే పడుతుందా?

First Published Nov 17, 2020, 4:10 PM IST

ముంబై ఇండియన్స్ జట్టులో అద్భుతంగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. గత మూడు సీజన్లుగా 400+ పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్... ప్రస్తుతం ఓ అనుకోని వివాదంలో ఇరుక్కున్నాడు...

తాను గాయం నుంచి కోలుకున్నానని చెబుతున్నా రోహిత్ శర్మను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయలేదు బీసీసీఐ. ఎట్టకేలకు ఫామ్ నిరూపించుకోవడంతో టెస్టులకు మాత్రం ఎంపిక చేసి, సరిపెట్టుకోమ్మని హితవు చెప్పారు...
undefined
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి మధ్య ఉన్న విభేదాలే ఈ రాద్ధాంతానికి కారణమనేవాళ్లు చాలామంది ఉన్నారు. అంతేనా ముంబై జట్టులోని సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇంతవరకూ భారత జట్టుకి ఎంపిక కాకపోవడానికి ఇదే కారణమని వాదిస్తున్నవాళ్లు ఉన్నారు...
undefined
ఈ సమయంలో అనుకోని ఓ వివాదం ఇరుక్కున్నాడు భారత ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్. విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ నెటిజన్ పెట్టిన ఓ ట్వీట్‌కి సూర్యకుమార్ యాదవ్ లైక్ కొట్టడమే ఈ వివాదానికి కారణం.
undefined
‘ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు అసలు సిసలైన కెప్టెన్సీ లక్షణాలున్నాయి... విరాట్ కోహ్లీ ఓ పేపర్ కెప్టెన్ మాత్రమే... ’ అంటూ ఓ నెటిజన్ వేసిన ట్వీట్‌కి లైక్ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్.
undefined
స్టార్ క్రికెటర్ తన ట్వీట్‌కి లైక్ కొట్టడంతో దాన్ని స్క్రీన్ షాట్ వేసి పెట్టుకున్నాడు సదరు నెటిజన్. తాను చేసిన తప్పు గ్రహించిన సూర్యకుమార్ యాదవ్, ట్వీట్‌కి డిజ్ లైక్ కొట్టి తప్పించుకోవాలని చూశాడు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.
undefined
‘కెప్టెన్ విరాట్ కోహ్లీతోనే పెట్టుకుంటావా... ఇక నీ కెరీర్ ముగిసినట్టే... జన్మలో టీమిండియాకు ఎంపిక కాలేవు’ అంటూ నెటిజన్లు సూర్యకుమార్ యాదవ్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు...
undefined
ఇంతకుముందు ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత జట్టులో రోహిత్ శర్మ స్థానంలో అనుష్క శర్మ ఉందంటూ ఓ నెటిజన్ వేసిన ట్వీట్‌కి లైక్ కొట్టాడు రోహిత్. అప్పట్లో అది చాలా పెద్ద రచ్చకు దారి తీసింది.
undefined
ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌కు తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు... ‘త్రీడీ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్‌లు చూస్తానంటూ’ పెట్టిన ట్వీట్ పెను సంచలనమే క్రియేట్ చేసింది.
undefined
త్రీడీ గ్లాసెస్ ట్వీట్ వివాదాస్పదం కావడంతో మనస్థాపం చెంది క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటిరాయుడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కి కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెడ్జింగ్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
ఆ కోపం మనసులో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ ఇలా ప్రవర్తించి ఉండవచ్చని, అయితే భారత జట్టుకు ఆడాలనే తన కోరిక తీరాలంటే ఇలా చేయకుండా ఉండాల్సిందని హితవు చేస్తున్నారు మరికొందరు...
undefined
ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక చేస్తారనే వార్తలు వినిపించినా, అతనికి మొండిచెయ్యి చూపించారు సెలక్టర్లు.
undefined
సూర్యకుమార్ యాదవ్‌కి కూడా సమయం వస్తుందని, ఓపిగ్గా ఎదురుచూడాలని భారత కోచ్ రవిశాస్త్రీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే.
undefined
click me!