నా బాలీవుడ్ క్రష్ ఆమెనే.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సారాను పక్కనబెట్టి ‘నేషనల్ క్రష్’ పేరు చెప్పాడుగా..

Published : Mar 06, 2023, 04:48 PM IST

టీమిండియా  ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతున్న  స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన బాలీవుడ్ క్రష్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే  గిల్ చెప్పిన పేరు అతడు డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు వస్తున్న సారా అలీ ఖాన్ అయితే కాదు..   

PREV
17
నా బాలీవుడ్ క్రష్ ఆమెనే.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సారాను పక్కనబెట్టి ‘నేషనల్ క్రష్’ పేరు చెప్పాడుగా..

గడిచిన కొద్దిరోజులుగా భారత జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న   శుభ్‌మన్ గిల్  తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగమయ్యాడు.   తొలి రెండు టెస్టులలో ఆడేందుకు అవకాశం రాకున్నా  ఇండోర్ లో ఆడినా పెద్దగా రాణించలేదు. 

27

అయితే  గిల్  వృత్తిగత జీవితం గురించే గాక   పర్సనల్ లైఫ్ మీద కూడా సోషల్ మీడియాలో ఆసక్తకిర చర్చ సాగుతోంది. గిల్  గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో  ప్రేమాయణం నడిపినా అది బెడిసికొట్టిందని తర్వాత అతడు  బాలీవుడ్  స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్  కూతురు సారా అలీ ఖాన్ తో  డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 
 

37

ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి  కాఫీ షాకులకు వెళ్లడం.. డిన్నర్లు చేయడం వంటివి మీడియాకు చిక్కడంతో సారా-గిల్ లవ్ స్టోరీ నిజమేనని చెబుతున్నవారూ లేకపోలేదు. ఈ చర్చ ఇలా సాగుతుండగానే తాజాగా గిల్  తన బాలీవుడ్ క్రష్ గురించి వెల్లడించాడు.   

47

మీడియాతో గిల్ మాట్లాడుతుండగా అక్కడ పలువురు.. ‘మీ ఫస్ట్ బాలీవుడ్ క్రష్ ఎవరు..?’ అని ప్రశ్నించారు. ముందు సమాధానం దాటవేయడానికి యత్నించిన  గిల్ తర్వాత ఓపెన్ అయ్యాడు. తనకు ‘నేషనల్ క్రష్’ రష్మికా మందన్న  అంటే ఇష్టమని, ఆమె తన ఫస్ట్ క్రష్ అని చెప్పి అక్కడ్నుంచి జారుకున్నాడు.  

57

గిల్ ఈ విషయం  చెప్పిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో రష్మిక ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ ఇద్దరినీ జతచేసి   పోస్టర్లు, మీమ్స్  నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.  అయితే రష్మిక ఇంతవరకు గిల్ కామెంట్ పై స్పందించలేదు. ఆమె ఫ్యాన్స్ తో పాటు గిల్ అభిమానులు కూడా రష్మిక స్పందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

67

2016లొ  కన్నడ సినిమా  కిరాక్ పార్టీ సినిమాతో అరంగేట్రం చేసిన  రష్మిక.. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నేషనల్ స్టార్ గా అవతరించింది.  తెలుగులో ఆమె నటించిన పుష్ప.. రష్మికను పాన్ ఇండియా స్టార్ గా చేశాయి.  ఈ సినిమాతో పాటుగా  రష్మిక బాలీవుడ్ లో  గుడ్‌బై, మిషన్ మజ్ను సినిమాలు చేసింది.  ఈ రెండూ ఆశించిన ఫలితాలైతే రాలేదు. 

77

వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలలో కూడా ఆమె ప్రస్తుతం నటిస్తోంది. అంతేగాక  పుష్ప - 2 తో కూడా  మరోసారి బాలీవుడ్ అభిమానులను అలరించడానికి తయారవుతున్నది ఈ  కన్నడ కస్తూరి.   బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్  సందీప్ రెడ్డి వంగ  తీస్తున్న ‘ఎనిమల్’ లో కూడా  రష్మికనే హీరోయిన్ గా నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories