శ్రేయాస్ అయ్యర్‌‌కి గాయం... ఢిల్లీ క్యాపిటల్స్‌కూడా ఆ తప్పు చేయనుందా...

First Published Mar 25, 2021, 9:51 AM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు అయ్యర్... దీంతో కెప్టెన్‌గా ఎవరు వ్యవహారించబోతున్నారని చర్చ జరుగుతోంది.  

ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్ చేతి ఎముక జరగడంతో దానికి చికిత్స చేసిన వైద్యులు, అతనికి కనీసం నెలన్నర విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో అతను వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లో సగం మ్యాచులకు అయ్యర్ దూరం కాబోతున్నాడు...
undefined
మూడు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న శ్రేయాస్ అయ్యర్, 2020 సీజన్‌లో డీసీ మొట్టమొదటిసారి ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు...
undefined
అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది...
undefined
గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు స్టీవ్ స్మిత్. అయితే స్మిత్ కెప్టెన్సీలో ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ఆర్ఆర్.
undefined
దీంతో స్టీవ్ స్మిత్‌ను ఏకంగా జట్టు నుంచే పక్కనబెట్టింది రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు ఆర్ఆర్ చేసిన తప్పే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చేయబోతుందా? అని చర్చ నడుస్తోంది...
undefined
రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే కూడా ప్రస్తుతం ఢిల్లీ జట్టులోనే ఉన్నాడు. అయితే రహానేకి కూడా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఏమంత మంచి రికార్డు లేదు. అదీగాక గత సీజన్‌లో తుదిజట్టులో రావడానికి బాగా కష్టపడ్డాడు రహానే...
undefined
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్న వారిలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహారించాడు రవిచంద్రన్ అశ్విన్..
undefined
ఢిల్లీలో ఉన్న యంగ్ ప్లేయర్లను సమర్థవంతంగా నడిపించడంలో సీనియర్ స్పిన్నర్ కీలక పాత్ర పోషించగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
పృథ్వీషా... విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో ముంబై జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన పృథ్వీషా, ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పృథ్వీషాకి అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన అనుభవం కూడా ఉంది...
undefined
కాబట్టి శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోతే పృథ్వీషా జట్టును విజయపథంలో నడిపించగలడని అంటున్నారు అభిమానులు. అయితే ఆన్‌లైన్ ఓటింగ్‌లో అశ్విన్‌కి ఎక్కువ ఓట్లు రాగా, పృథ్వీషాకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి...
undefined
రిషబ్ పంత్... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న రిషబ్ పంత్, జట్టును నడిపించగలడని అంటున్నారు అతని అభిమానులు. శ్రేయాస్ అయ్యర్ లేని లోటు తెలియకుండా డీసీని లీడ్ చేయాలంటే పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వడమే కరెక్టని అంచనా వేస్తున్నారు...
undefined
ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్సీ కోసం ఈ ఐదుగురే పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి కెప్టెన్సీ దక్కబోతుందనేది ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రకటించేదాకా తెలీదు...
undefined
click me!