అమెరికాలో క్రికెట్ ఫ్రాంఛైజీ కొంటున్న షారుక్ ఖాన్... అక్కడ కూడా నైట్‌రైడర్స్‌యే....

Published : Dec 01, 2020, 05:46 PM IST

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పేరుతో ఫ్రాంఛైజీని కలిగి ఉన్న షారుక్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ‘ట్రినిడాడ్ అండ్ టొబాగో’ జట్టును కలిగి ఉన్నాడు. తాజాగా మరో కొత్త ఫ్రాంఛైజీ కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు షారుక్.

PREV
110
అమెరికాలో క్రికెట్ ఫ్రాంఛైజీ కొంటున్న షారుక్ ఖాన్... అక్కడ కూడా నైట్‌రైడర్స్‌యే....

అమెరికాలో క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లేదు. అయితే రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ పేరుతో యునైటెడ్ స్టేట్స్‌లో ఓ మెగా క్రికెట్ లీగ్ చేపట్టాడు.

210

ఈ లీగ్ ద్వారా బేస్‌బాల్‌, ఫుట్‌బాల్ వంటి క్రీడలను అమితంగా ఇష్టపడే అమెరికన్లకి క్రికెట్‌ని పరిచయం చేయాలని సచిన్ చేసిన ప్రయత్నం చాలావరకూ విజయవంతమైంది.

310

క్రికెట్ ఆల్‌స్టార్స్ మ్యాచులను చూసేందుకు అమెరికన్లు ఎగబడ్డారు. దీంతో అక్కడ అమెరికన్ టీ20 లీగ్ నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

410

ఐపీఎల్ 2022 తర్వాత అమెరికాలో జరిగే ఈ మెగా క్రికెట్ లీగ్‌లో ఓ జట్టును కొనుగోలు చేయాలని చూస్తోంది నైట్‌రైడర్స్...

510

‘కొన్నేళ్లుగా నైట్‌రైడర్స్ బ్రాండ్‌ని విశ్వవ్యాప్తం చేయడానికి మేం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అమెరికాలో టీ20 క్రికెట్‌కి పెరుగుతున్న ఆదరణను గమనిస్తున్నాం. అందుకే మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగస్వామ్యులం అయ్యేందుకు ఎదురుచూస్తున్నాం...’ అంటూ వ్యాఖ్యానించాడు షారుక్ ఖాన్.

610

అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ కొంచెం తక్కువే. అయితే క్రికెట్ చూసేవాళ్లే సంఖ్య, క్రికెట్ ఆడాలనుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. 

710

ఇండియా తర్వాత క్రికెట్‌కి అత్యంత ఆదరణ కలిగిన అతిపెద్ద మార్కెట్ అమెరికానే.. ’ అని నైట్‌రైడర్స్ గ్రూప్ సీఈవో వెంకీ మైసూర్ కామెంట్ చేశాడు.

810

గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది షారుక్ ఖాన్ ఫ్రాంఛైజీ కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

910

రెండు సార్లు టైటిల్ గెలిచిన నైట్‌రైడర్స్ ద్వారా షారుక్‌కి కొన్ని వందల కోట్ల ఆదాయం అందుతోంది. దాంతో అదే పేరు కింగ్ ఖాన్‌కి సెంటిమెంట్‌గా మారిపోయింది.

1010

అమెరికాలో జరిగబోయే ‘మేజర్ లీగ్ క్రికెట్‌’లో షారుక్ కొనుగోలు చేయబోయే జట్టు పేరు ‘లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్’ అని ప్రచారం జరుగుతోంది..

click me!

Recommended Stories