రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ, అవన్నీ విని నవ్వుకుంటాం... బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ...

First Published Jan 1, 2022, 12:42 PM IST

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి బాగోలేదని చాలారోజులుగా వినిపిస్తున్న వార్త. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి...

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు విరాట్ కోహ్లీ ఇష్టపడడం లేదని, అందుకే సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి...

అయితే ఆ వార్తల్లో నిజం లేదని, ఎవ్వరి కెప్టెన్సీలో అయినా ఆడడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదని స్వయంగా విరాట్ కోహ్లీ ప్రకటించాడు...

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకి ఆ పగ్గాలను బీసీసీఐ అప్పగించడం జరిగింది. 

 అయితే టీ20తో పాటు వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా కావాలని రోహిత్ శర్మ పట్టుబట్టాడని, అందుకే బలవంతంగా విరాట్‌ను ఆ పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి...

తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఈ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని మేం అందరూ కోరాం. అయితే అతను మా మాట వినిపించుకోలేదు...

వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో వన్డే ఫార్మాట్ బాధ్యతలు కూడా రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చింది...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు, వైరం లేదు. ఇలాంటి వార్తలన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాం. వారిద్దరూ ఓ ఫ్యామిలీలా ఉంటారు...

భవిష్యత్తు గురించి, రాబోయే ఐసీసీ టోర్నీల గురించి కూడా వాళ్లిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు జట్టులో వాతావరణం చాలా బాగుంది...

నా ప్లేస్‌లో ఉండి చూస్తే, మీరు టీమిండియా పర్ఫామెన్స్‌ను, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లు ప్లేయర్లలా కాకుండా ఓ కుటుంబంలా కలిసిపోయారు...

తొలి టెస్టు మధ్యలో జట్టును ప్రకటించకూడదనే ఉద్దేశంతో మ్యాచ్ పూర్తయ్యేదాకా వేచి చూశాం. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఈ విషయంలో కావాల్సినంత సమయం ఇచ్చాం...’ అంటూ కామెంట్ చేశాడు చేతన్ శర్మ...

click me!