టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గెలిచిన జట్టుకి టైటిల్‌తో పాటు... ప్రైజ్‌మనీని ప్రకటించిన ఐసీసీ...

First Published Jun 14, 2021, 5:32 PM IST

టెస్టు ఫార్మాట్‌లో ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్... మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. టెస్టు వరల్డ్‌కప్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫైనల్ గెలిచిన జట్టుకి అందించబోయే ప్రైజ్‌మనీని ప్రకటించింది ఐసీసీ...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టుకి ట్రోఫీగా బంగారు గదను అందిస్తారు. దాంతో పాటు గెలిచిన జట్టుకి పారితోషికంగా 1.6 మిలియన్ డాలర్లు (దాదాపు 11 కోట్ల 71 లక్షల రూపాయలకు పైగా) అందిస్తుంది ఐసీసీ...
undefined
అలాగే ఫైనల్ మ్యాచ్‌లో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమ్‌కి ఇందులో సగం... అంటే 8 లక్షల డాలర్లు (దాదాపు 5 కోట్ల 85 లక్షల రూపాయలకు పైగా) ప్రైజ్‌మనీ దక్కుతుంది.
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెలిచిన న్యూజిలాండ్ జట్టు, ప్రస్తుతం ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లోకి చేరుకుంది. ఇన్నాళ్లు టాప్‌లో ఉన్న టీమిండియా, రెండో స్థానానికి పడిపోయింది.
undefined
అయితే ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే, మళ్లీ టాప్ ర్యాంకుకి చేరుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్‌ న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఉండే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుండడంతో హాట్ ఫెవరెట్‌గా కివీస్ ఫైనల్ బరిలో దిగుతోంది.
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 17 టెస్టులు ఆడిన టీమిండియా 12 మ్యాచుల్లో విజయం సాధించి 72.2 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.
undefined
మరోవైపు ఏడు టెస్టులు గెలిచిన న్యూజిలాండ్ జట్టు, 70 శాతం విజయాలతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది...
undefined
తొలుత పాయింట్ల ఆధారంగా ఫైనల్ ఆడే జట్లను నిర్ణయించాలని భావించిన ఐసీసీ, కరోనా లాక్‌డౌన్ పుణ్యమాని సిరీస్‌లు రద్దుకావడంతో తుదిపోరు ఆడే జట్లను ఎంచుకునే పద్ధతిని మార్చేసింది...
undefined
పాయింట్ల పద్ధతిలో కాకుండా విజయాల శాతం ఆధారంగా ఫైనల్‌ ఫైట్‌లో పాల్గొనే టీమ్‌లను నిర్ణయించాలని ఫిక్స్ అయ్యింది. ఈ నిర్ణయం కారణంగా తక్కువ టెస్టులు ఆడినా ఎక్కువ విజయాలు అందుకున్న న్యూజిలాండ్ ఫైనల్ చేరుకుంది.
undefined
ఎక్కువ పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ టెస్టులు ఆడడంతో విజయాల శాతం రేటు పడిపోవడంతో ఇంగ్లాండ్ ఫైనల్‌కి చేరుకోలేకపోయింది. పాయింట్ల ఆధారంగా చూస్తే భారత్‌ అత్యధిక పాయింట్లతో టాప్‌లో ఉంటే, ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది.
undefined
click me!