IPL 2022: ఆడా ఉంటాం..! ఈడా ఉంటాం..!! ముంబై-చెన్నైలలో ఆడిన ఆటగాళ్లు వీళ్లే..

Published : Apr 21, 2022, 04:50 PM IST

TATA IPL 2022 - MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజయవంతమైన జట్లు గా పేరొందిన ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నేడు రాత్రి కీలక పోరు జరుగనుంది. మరి ఈ రెండు జట్లలో ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..? 

PREV
19
IPL 2022: ఆడా ఉంటాం..! ఈడా ఉంటాం..!! ముంబై-చెన్నైలలో ఆడిన ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్ లో ఇప్పటిదాకా 32 మ్యాచులు ముగిశాయి.  కానీ ఏ మ్యాచ్ కు కూడా ఇంత హైప్ రాలేదు.  అలాగని ఇదేమైనా ప్లేఆఫ్సా, ఫైనలా..? అంటే అదీ కాదు. 33వ లీగ్ మ్యాచ్.. అంతే. కానీ ఈ మ్యాచ్ జరుగుతున్నది ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్లుగా ఉన్న ముంబై - చెన్నై మధ్య.  మరి ఈ రెండు జట్లలో  ఆడిన విజయవంతమైన ఐదుగురు ఆటగాళ్లెవరో ఇక్కడ చూద్దాం. 

29

1. డ్వేన్ బ్రావో: ఈ విండీస్ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో ఆడాడు.  అతడి ఐపీఎల్ కెరీర్ స్టార్టయ్యిందే (2008) ముంబై తో. తొలి మూడు సీజన్లు  ముంబై తరఫునే ఆడాడు బ్రావో. ఆ తర్వాత 2011 నుంచి  చెన్నైతోనే ఆడుతున్నాడు. 

39

అయితే మధ్యలో చెన్నైపై రెండేండ్లు నిషేధం పడటంతో 2016, 2017 లో  రైనా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు.   కానీ మళ్లీ  2018 నుంచి చెన్నైతోనే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న వీరుడిగా ఉన్న బ్రావో.. నేడు తన మాజీ జట్టుతో కీలక మ్యాచ్ లో తలపడబోతున్నాడు. 

49

2. అంబటి రాయుడు : 2010లో ముంబై ఇండియన్స్ తోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు రాయుడు. నిలకడైన ఆటతీరుతో ముంబై అభిమానులతో పాటు యాజమాన్యాన్ని కూడా మెప్పించిన  అతడు.. 2018లో చెన్నైకి మారాడు.  2018, 2021 లలో సీఎస్కే టైటిల్ నెగ్గడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు.  ఈ సీజన్ లో ఆరు మ్యాచులాడిన  రాయుడు.. 128 పరుగులు చేశాడు. 

59

3. హర్భజన్ సింగ్ : ఐపీఎల్  లో మూడు జట్ల తరఫున ఆడాడు భజ్జీ. వీటిలో  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి 2018 వరకు  ముంబై తోనే ఉన్నాడు. 2018 వేలంలో అతడిని చెన్నై దక్కించుకుంది. 

69

2019 సీజన్ లో భజ్జీ ఏకంగా 11 మ్యాచుల్లోనే 16 వికెట్లు  పడగొట్టాడు. ముంబై తరఫున 136 మ్యాచులాడిన టర్బోనేటర్.. 127 వికెట్లు తీశాడు.

79

4. పీయూష్ చావ్లా : ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న  టాప్-5 బౌలర్ల జాబితాలో ఉన్న చావ్లా.. 2020 లో చెన్నై తరఫున ఆడాడు. సీఎస్కే తరఫున ఏడు మ్యాచులాడాడు.  కానీ తర్వాత సీజన్ లో ముంబై కి మారాడు. 2021 లో ముంబై తరఫున ఒక్కటే మ్యాచ్ ఆడిన చావ్లా కు ఆ జట్టు పెద్దగా అవకాశాలివ్వలేదు.  కానీ  కేకేఆర్ కు చాలాకాలం ఆడిన చావ్లా.. తన 14 ఏండ్ల ఐపీఎల్ కెరీర్ లో 165 మ్యాచులాడి 157 వికెట్లు తీశాడు. 

89

5. కర్ణ్ శర్మ : ఐపీఎల్ లో మూడు జట్ల తరఫున ఆడి టైటిల్ నెగ్గిన ఆటగాడిగా కర్ణ్ శర్మకు పేరుంది. అందులో రెండు జట్లు ముంబై, చెన్నై కావడం గమనార్హం. 2017 లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన శర్మ.. 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు.  ఇక 2018లో అతడు చెన్నైకి మారాడు.  ఈసారి 4 మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 

99

అయితే మ్యాచ్ ప్రదర్శన ఎలా ఉన్నా కర్ణ్ ను మాత్రం ఐపీఎల్ జట్లు లక్కీ ప్లేయర్ గా  భావిస్తాయి.  కర్ణ్ జట్టులో ఉండగా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన  మూడో జట్టు సన్ రైజర్స్ హైదరాబాదే కావడం విశేషం. 

click me!

Recommended Stories