రిషబ్ పంత్‌కి గాయం... టీమిండియాని వదలని గాయాల బెడద... సగానికి పైగా...

First Published Jan 9, 2021, 9:07 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్ గాయాల కారణంగా టెస్టు సిరీస్ మధ్యలో నుంచే స్వదేశానికి తిరిగి రాగా... మూడో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. దీంతో భారత అభిమానుల కలవరపడుతున్నారు.

ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో 141 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన బంతి, రిషబ్ బంత్ మోచేతి కింద బలంగా తగిలింది...
undefined
గాయంతో విలవిలలాడిన రిషబ్ పంత్, ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు... రిషబ్ పంత్ గాయం తీవ్రమైతే భారత జట్టు తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది...
undefined
ఇప్పటికే సగానికి పైగా భారత జట్టు క్రికెటర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఆసీస్ టూర్‌లో ఇంకా ఓ టెస్టు మిగిలి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది...
undefined
మహ్మద్ షమీ: తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్యాట్ కమ్మింగ్స్ బౌలింగ్‌లోనే గాయపడ్డాడు మహ్మద్ షమీ. గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
undefined
కెఎల్ రాహుల్: రెండో టెస్టు తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు కెఎల్ రాహుల్. నెట్స్‌లో గాయపడి ఒక్క టెస్టు కూడా ఆడకుండానే స్వదేశానికి పయనమయ్యాడు కెఎల్ రాహుల్.
undefined
ఇషాంత్ శర్మ: ఐపీఎల్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి కూడా దూరమయ్యాడు...
undefined
భువనేశ్వర్ కుమార్: ఐపీఎల్‌లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్ దాకా భువీ కోలుకోవడం కష్టమేనని కొందరు అంటుంటే, ఇంగ్లాండ్ సిరీస్‌తో అతను రీఎంట్రీ ఇస్తాడని మరికొందరు భావిస్తున్నారు.
undefined
శ్రేయాస్ అయ్యర్: టీ20, వన్డేల్లో భారత జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్‌ను టెస్టులకి కూడా రిజర్వు ప్లేయర్‌గా ఉంచాలని భావించింది బీసీసీఐ. అయితే టీ20 సిరీస్‌లో గాయపడిన అయ్యర్, స్వదేశానికి పయనమయ్యాడు.
undefined
మనీశ్ పాండే: భారత జట్టు లక్కీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మనీశ్ పాండే, ఆసీస్‌తో మొదటి టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే గాయం కారణంగా మిగిలిన టీ20లకు దూరమయ్యాడు మనీశ్ పాండే.
undefined
అమిత్ మిశ్రా: ఐపీఎల్‌లో గాయపడి, సీజన్ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు అమిత్ మిశ్రా. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా భారత జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే.
undefined
వరుణ్ చక్రవర్తి: ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, సెలక్టర్లు దృష్టిలో పడ్డాడు యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఆసీస్ టూర్‌లో టీ20 సిరీస్‌కు ఎంపికైన వరుణ్ చక్రవర్తి, గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో నటరాజన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
undefined
రవీంద్ర జడేజా: మొదటి టీ20 మ్యాచ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, టీ20 సిరీస్‌తో పాటు మొదటిటెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
undefined
రోహిత్ శర్మ: ఐపీఎల్‌లో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ... కోలుకుని మిగిలిన రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియాకి వచ్చాడు.
undefined
click me!