కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఓడిపోవడం పక్కా! అని ప్రత్యర్థులు కూడా భయపడేలా సాగింది రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆసీస్ టీమ్ డామినేషన్...
రికీ పాంటింగ్ టీమ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్, గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, షేన్ వార్న్ వంటి లెజెండరీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు...
29
షేన్ వార్న్‌తో కలిసి దాదాపు 14 ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్‌ని షేర్ చేసుకున్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, తన స్నేహితుడి అకాల మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు...
39
షేన్ వార్న్ మరణవార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రికీ పాంటింగ్, బతికి ఉన్నప్పుడు తనతో మూడు మాటలు చెప్పలేకపోయానంటున్నాడు...
49
‘సారీ ఫ్రెండ్! నువ్వుంటే నాకు ఎంత ఇష్టమో నీకు ఎప్పుడూ చెప్పలేదు. నీతో గడిపిన క్షణాలు ఎంతో ఎంజాయ్ చేశా. కానీ నీకు ఎప్పుడూ నీపై ఉన్న ఇష్టాన్ని చెప్పలేదు...
59
ఇప్పుడు చెబుదామని ఉన్నా, వినడానికి నువ్వు లేవు. ఇప్పటికీ టీవీల్లో నీ గురించి నివాళి కార్యక్రమాలు వస్తుంటే వెంటనే ఆఫ్ చేసేస్తున్నా...
69
నువ్వు మాతో లేవనే నిజాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్లిపోయి నాపై పెద్ద భారం మోపేశావు... నువ్వు భావి తరాలకు నేర్పాలనుకున్న విషయాలన్నీ ఇప్పుడు వారికి అందించాల్సిన బాధ్యత నాదే...
79
స్టీవ్ స్మిత్, రషీద్ ఖాన్ వంటి కొన్ని వందల మంది స్పిన్నర్లకు నువ్వు విలువైన సూచనలు ఇచ్చావు. వారిని స్టార్లుగా మలిచావు...
89
కొన్ని నిమిషాల్లోనే నీ ఫోటోలు వేల సంఖ్యలో చూశాను. ఎంత మంది క్రికెటర్లతో మాట్లాడావు, మరెంత మందికి కనిపించని కోచ్‌గా ఉన్నావు... నువ్వు ఎప్పటికీ గొప్ప క్రికెటర్‌వే...’ అంటూ ఎమోషనల్ అయ్యాడు రికీ పాంటింగ్...
99
అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆసీస్ స్పిన్ బౌలర్ షేన్ వార్న్. తన కెరీర్ లో 145 టెస్టులాడిన షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు, 194 వన్డే మ్యాచులు ఆడి 293 వికెట్లు తీశాడు.